తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అండర్​ వేర్ ఎన్ని రోజులు ఉపయోగిస్తున్నారు? అలాగే వాడితే ఏమవుతుందో తెలుసా? - problems of underwear not change

What Happens If Dont Change Underwear : చలికాలంలో అండర్ వేర్ సమస్య వేధిస్తుంటుంది. ఒకటి వాడేసి ఉంటారు.. రెండోది తడి ఆరదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రోజుల తరబడి ఒక్కదాన్నే ఉపయోగిస్తుంటారు! దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

What Happens If Dont Change Underwear
What Happens If Dont Change Underwear

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 1:35 PM IST

What Happens If Dont Change Underwear : వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకుంటే సరిపోదు. క్లీన్ దుస్తులు కూడా ధరించాలి. అయితే.. కొంత మంది చలికాలంలో ఉదయాన్నే స్నానం చేయడానికి ఇష్టపడక అలానే తమ రోజువారి పనులను నిర్వర్తిస్తుంటారు. ఈ సమయంలో వారు లోదుస్తువులను కూడా మార్చకుండా ఉంటారు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వెంటాడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరుసగా రెండు, మూడు రోజుల పాటు ఉతకని లోదుస్తువులు ధరిస్తే.. స్కిన్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

రోజూ తలస్నానం చేయకపోయినా ఏం కాదు కానీ.. తప్పకుండా లోదుస్తువులను మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ లోదుస్తువుల పరిశుభ్రతపై అమెరికాలో ఒక సర్వేను నిర్వహించారు. ఇందులో రెండు వేల మంది ప్రజలు పాల్గొన్నారు. వీరిలో 45 శాతం మంది రెండు రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఒకే లోదుస్తువులను ధరించారు. దీనివల్ల వారిలో అనారోగ్య సమస్యలు వచ్చినట్లు సర్వే నిర్వాహకులు గుర్తించారు.

దురద, చికాకు కలుగుతుంది..
రెండు, మూడు రోజులపాటు ఉతకని లోదుస్తువులను వాడటం వల్ల అక్కడ చెమటతో బ్యాక్టీరియా, ఈస్ట్, ఫంగస్ వృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో దురద, మంట సమస్య ఏర్పడుతుందని అంటున్నారు. ఇది తీవ్రస్థాయిలో మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేస్తాయి.

మీరు నేల మీద పడుకోవడం లేదా? ఈ సమస్యలు వేధిస్తూనే ఉంటాయి!

దుర్వాసన వస్తుంది..
ఉతకని లోదుస్తువులను ఉపయోగించడం వల్ల ప్రైవేట్‌ పార్ట్స్‌ నుంచి దుర్వాసన సమస్య వేధిస్తుందని చెబుతున్నారు. ఇది సమస్య ఎక్కువగా ఉందని సూచిస్తుందని అంటున్నారు. ఇలాంటప్పుడు అస్సలు ఆలస్యం చేయకుండా ఉతికిన లోదుస్తువులను ధరించాలని తెలియజేస్తున్నారు.

అలర్జీ, ర్యాషెస్‌..
లోదుస్తువులు పరిశుభ్రంగా లేకపోతే ఆ ప్రాంతంలో అలర్జీ, ర్యాషెస్‌ వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో ఎర్రటి మొటిమలు ఏర్పడి, చికాకును కలిగిస్తాయని చెబుతున్నారు.

  • ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఇది సాధారణంగా మహిళల్లో కనిపిస్తుంది. చాలా కాలం పాటు అపరిశుభ్రంగా ఉండే లోదుస్తువులను ధరించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది.
  • ఒకే లోదుస్తువును రెండు, మూడు రోజుల పాటు ఉపయోగించడం వల్ల సున్నితంగా ఉండే జననేంద్రియ ప్రాంతంలో దద్దుర్లు, చర్మం ఎర్రగా మారడం జరుగుతుంది. దీనివల్ల దురద, చికాకు సమస్యలు వెంటాడుతాయి.

చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

  • జిమ్‌లో వ్యాయామం చేసి వచ్చిన తరవాత, శుభ్రంగా స్నానం చేసి ఉతికిన లోదుస్తువులను ధరించాలి.
  • అలాగే పీరియడ్స్‌ సమయంలో లోదుస్తువులను రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • ప్రతిరోజు ఉతికిన లోదుస్తువులను ధరించి పరిశుభ్రతను పాటించాలని నిపుణులు కోరుతున్నారు.
  • చాలా చిన్నగా కనిపించే ఈ సమస్యను ఏమాత్రం అశ్రద్ధ చేసిన కూడా, చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
  • చర్మ సమస్యలు ఏమైనా కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

చలికాలంలో పిల్లలకు న్యూమోనియా ప్రమాదం - ఇలా చేయండి - లేకపోతే ఇబ్బందే!

ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details