Healthy Food: ప్రతి మనిషికి వ్యాధి నిరోధక శక్తి చాలా కీలకం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బాలింతలు, అవయవ మార్పిడి చేసుకున్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం.
- తాజా కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, చేపలు, మాంసం తినాలి.
- బియ్యం, జోన్నలు, గోధుమలు, చిక్కుడు రకానికి చెందిన గింజలు ఉండేలా చూసుకోవాలి.
- పీచు అధికంగా ఉండే పాక్షికంగా పాలిష్ చేసిన జొన్నలు, చిరుధాన్యాలు, ఓట్స్, బ్రౌన్రైస్ భోజనంలో ఉండేలా చూసుకోవాలి.
- వంటల్లో వెన్న ,నెయ్యి, కొవ్వులకు బదులు ఆలివ్, సోయా, పొద్దుతిరుగుడు పువ్వులతో చేసిన నూనెలను వినియోగించాలి.
- చక్కెర,ఉప్పు అధికంగా ఉండే శీతల పానీయాలకు బదులు తాజా పండ్లనే తినాలి.
- పిల్లలకు సైతం ఇలాంటివే అందించాలి. వారికిచ్చే ఆహారంలో ఉప్పు, చక్కెర తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- నిత్యం పరిశుభ్రమైన నీటిని సరిపడా తాగాలి.
- ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి.
- తీపి పదార్థాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.
- ప్యాక్ చేసిన ఆహారం తీసుకోవాల్సి వస్తే.. సోడియం తక్కువ ఉన్నవాటికే ప్రాధాన్యం ఇవ్వాలి.
- మద్యం తాగడం ప్రాణాలతో చెలగాటంతో సమానం. కరోనా నుంచి కాలేయం, గుండె జబ్బులకు మానసిక అసమతుల్యతకు దారి తీస్తుంది.