తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Weight loss: వాకింగ్​ చేసినా బరువు తగ్గట్లేదా? - బరువు తగ్గుటకు నడక

సాధారణంగా ఊబకాయులు బరువు తగ్గేందుకు భావించే ప్రప్రథమ (walking for weight loss) వ్యాయామం నడక. తమ వ్యాయామ సమయంలో నడకకూ కొంత సమయం కేటాయిస్తారు. అయితే ఇలా నడవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోతే ఎం చేయాలి?

walking for weight loss
బరువు తగ్గించే వాకింగ్​

By

Published : Oct 15, 2021, 7:15 AM IST

ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పట్ల ప్రజల దృక్పథంలో (walking for weight loss) మార్పు వస్తోంది. బరువు సమతూకంలో ఉండాలని యువతే కాదు.. కాస్త వయస్సు పైబడిన వారు జిమ్​ సెంటర్లు, మైదానాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే బరువు పెరిగినట్లు తెలియగానే మన మనసులో మెదిలే మొదటి ప్రత్యామ్నాయం నడక. కానీ నెలల పాటు వాకింగ్​ చేస్తున్నా బరువు తగ్గట్లేదని తెగ బాధపడుతుంటారు చాలామంది. బరువు తగ్గడానికి నడక సరైన విధంగా చేయాలంటున్నారు డాక్టర్లు.

  • వాకింగ్ చేసినా బరువు తగ్గట్లేదంటే సరైన విధంగా (walking for weight loss tips) వాకింగ్​ చేయట్లేదని అర్థం. ఎక్సైజ్​కు అవసరమైనంత బ్రిస్క్ వాకింగ్​ చేయాల్సి ఉంటుంది.
  • ఎంతసేపు వాకింగ్ చేస్తున్నారనేది కూడా ప్రాధాన్యమైన విషయం. 10-15 నిమిషాల నడక బరువు తగ్గడానికి పనికిరాదు. 60-90 నిమిషాల ఎక్సైజ్​ అవసరం.
  • ప్రస్తుతం ఉన్న బరువును యథాతథంగా ఉంచుకోవాలంటే మాత్రం 45 నిమిషాల ఎక్సైజ్​ అవసరం.
  • వాకింగ్​తో పాటు తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యం. కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినకూడదు.
  • సరైన విధంగా ఎక్సర్​సైజ్, ఆహారం అలవర్చుకున్నా.. బరువు తగ్గకపోతే అప్పుడు సర్జరీ వైపు ఆలోచించాల్సి ఉంటుంది.
  • 5-10 కేజీల బరువు అధికంగా ఉంటే సహజ (walking for weight loss plans) పద్ధతుల్లోనే బరువును తగ్గించుకోవాలి. అదే 20-30 కేజీల బరువు అధికంగా ఉంటేనే డాక్టర్​ను సంప్రదించి సర్జరీ చేయించుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details