తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఈ యోగాసనాలతో నెలరోజుల్లోనే ఊబకాయానికి చెక్​! - ఊబకాయం కోసం యోగాసనాలు

Weight Loss with Yoga: అధిక బరువును తగ్గించుకునేందుకు జిమ్​లు, డైటింగ్​లు అంటూ వివిధ పద్ధతులను ఫాలో అవుతున్నా.. ఫలితం ఉండట్లేదంటూ చాలా మంది వాపోతుంటారు. అయితే వీరి సమస్యకు యోగాతో చక్కని పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేస్తుంటే.. అధిక బరువును ఇట్టే వదిలించుకోవచ్చని అంటున్నారు. మరి బరువును తగ్గించే యోగాసనాలు.. వాటి సాధనలోని మెళకువలను ఇప్పుడు చూద్దాం.

weight loss
అధిక బరువు

By

Published : Mar 18, 2022, 7:29 AM IST

Weight Loss with Yoga: శరీరాన్ని ఆరోగ్యంగా తయారు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించే యోగాలో.. శరీర బరువును వేగంగా తగ్గించుకునేందుకు కూడా చక్కని పరిష్కారం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఊబకాయం సమస్యతో బాధపడేవారు యోగాలోని ప్రత్యేక ఆసనాలను 10 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే.. ఊబకాయంలో సగం భాగం తగ్గుతుందంటున్నారు. ఇందుకోసం రోజుకు 5 నుంచి 10 నిమిషాలు కేటాయిస్తే చాలని చెప్పుకొస్తున్నారు. నౌకాసనం, సూర్యముద్రలతో ఇది సాధ్యమని అంటున్నారు.

నౌకాసనం..

నౌకాసనం చేసేందుకు ముందుగా దండాసనం భాగానికి రావాలి. ఆ తర్వాత శవాసనంలోకి వెళ్లి.. కాళ్లను రెండు జతలో ఉంచుకోవాలి. రెండు చేతులూ వెనకాతల నిటారుగా ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్లను, శరీరాన్ని 30 డిగ్రీలు పైకి ఎత్తి.. నౌక ఆకృతిలో శరీరాన్ని స్థిరంగా ఉంచాలి. ఇప్పుడు యథావిధిగా మరోసారి మాములు స్థితికి చేర్చాలి. రెండు చేతులూ విశ్రాంత స్థితిలో శవాసనంలో ఉంచాలి. ఇలా రోజూ పొద్దున్న, సాయంత్రం.. 10,20 లేదా 30 సార్లు ఐదు విడతల కింద చేయాలి.

సూర్యముద్ర..

సూర్యముద్రను సుఖాసనం, వజ్రాసనం, పద్మాసనం లేదా కుర్చిలో కూర్చోని కూడా చేయొచ్చు. ఇందుకోసం రెండు చేతులూ మోకాళ్లపైన పెట్టి.. అరచేతులు పైకి వచ్చేలా చూసుకోవాలి. ఉంగరపు వేలు మధ్య భాగాన్ని అరచేతికి తాకించి.. దానిపై బొటన వేలుని ఆనించి మిగిలిన మూడు వేళ్లను తిన్నగా ఉంచాలి. ఈ స్థితిలో ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత కళ్లు తెరిచి ముద్రను రిలీజ్​ చేయాలి. ఈ సూర్యముద్రను మూడు పూట్లా 40-50 నిమిషాలు చేస్తూ వండిన ఆహారం తగ్గించుకుని.. పచ్చికూరగాయలు, ఫలాలు తింటే అతిసులభంగా బరువు తగ్గొచ్చు.

వీటితో పాటు కొన్ని సూర్యనమస్కారాలు, వాకింగ్​ కూడా చేసినట్లు అయితే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు.

ఇదీ చూడండి :మానసిక ఒత్తిడి ఉంటే శృంగారంలో పాల్గొనలేరా?

ABOUT THE AUTHOR

...view details