తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Weight loss Tips: నడకకు బదులుగా పరుగు తీస్తే ప్రయోజనాలెన్నో...!

అధిక బరువుతో బాధపడేవారు దాన్ని వదిలించుకోవడం కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు అప్పటికప్పుడు ఆహారపు అలవాట్లు మార్చుకుంటే మరికొందరు విపరీతమైన వర్కవుట్లు చేస్తుంటారు. అవేమీ లేకుండా జస్ట్‌ నడకకు బదులుగా పరుగు తీస్తే ఎన్నో ప్రయజనాలు ఉన్నాయని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు.

Weight loss Tips
Weight loss Tips

By

Published : Jul 13, 2021, 12:04 PM IST

శరీరం మన నియంత్రణలో ఉంటేనే ఆరోగ్యం, అందం, ఆనందం. ఇందుకు వ్యాయామమే సాధనం. ఈ విషయంలో మహిళలు.... సాధారణంగా నడకకు ప్రాధాన్యమిస్తారు. బదులుగా పరుగు తీస్తే ప్రయోజనాలెన్నో అంటారు వ్యాయామ నిపుణులు. అవేంటంటే...

  • పరుగు వల్ల అధిక కెలొరీలు కరుగుతాయి. దాంతో తక్కువ సమయంలోనే బరువు తగ్గడం సాధ్యమవుతుంది. ఇది ఒంటికే కాదు మెదడుకీ చురుకుదనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శరీరానికి, మెదడుకి మధ్య సమన్వయం పెరుగుతుంది.
  • పరుగెత్తడం వల్ల... శరీరంలోని అన్ని అవయవాలకూ వ్యాయామ ఫలితం అందుతుంది. దాని వల్ల ఆరోగ్యకరమైన చర్మం మీ సొంతమవుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరగడమే అందుకు కారణం. మనం తీసుకునే పోషకాలన్నీ శరీరంలోని అవయవాలన్నింటికీ సక్రమంగా అందుతాయి. వ్యర్థాలు బయటకు పోతాయి.
  • కండరాలు దృఢంగా మారడంతో పాటు కాళ్లు, శరీరం చక్కటి ఆకృతిలోకీ వస్తాయి. పరుగు వల్ల మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సగానికి తక్కువగా ఉంటుందని పరిశోధనలూ చెబుతున్నాయి. అధిక రక్తపోటూ అదుపులో ఉంటుంది.

మరికొన్ని చిట్కాలు

  • జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటూ ప్రొటీన్లు, మాంస కృత్తులు కలిగిన ఆహారం తీసుకుంటే.. బరువును అదుపులో ఉంచుకోవడం లేదా అధిక బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు.
  • వీటిలో కెలొరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని సలాడ్ల రూపంలో తీసుకుంటూ ఉండాలి. వీటిలో పీచూ అధికమే. ఇవి తింటే పొట్ట నిండిన భావన కలిగి ఆకలి వేయదు. ఆహారంలో మాంసకృత్తులు, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, పప్పులను తీసుకోవాలి.
  • వీటిలో పెద్ద మొత్తంలో కొవ్వులుంటాయి. కాబట్టి వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. బదులుగా ఆవిరిపై ఉడికించిన వాటిని తీసుకోవాలి. ఉదాహరణకు బంగాళా దుంప వేపుడు బదులుగా దాన్ని ఉడికించి కూరలా తింటే తక్కువ కెలొరీలు వస్తాయి.
  • చాలామంది బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయడమో లేదా ఆలస్యంగా తీసుకోవడమో చేస్తుంటారు. ఈ రెండూ సరికాదు. సమయానికి సరైన మోతాదులో బ్రేక్‌ఫాస్ట్‌ తప్పక చేయాలి. దీంట్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
  • రాత్రి పూట ఏ సమయానికి తింటున్నారో... ఏం తింటున్నారో గమనించుకోవాలి. వీలైనంత మటుకు చాలా తేలికగా అరిగే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి. త్వరగా డిన్నర్‌ ముగించాలి. దానికీ, నిద్రకూ మధ్య కనీసం రెండు, మూడు గంటల వ్యవధి ఉంటే మంచిది.

ఇదీ చూడండి: Weight loss: బరువు తగ్గడం కష్టం కాదు!

ABOUT THE AUTHOR

...view details