Weight Loss Tips :బరువు తగ్గాలిఅనుకునే వారు.. వ్యాయామం చేయడంతో పాటు, పలు ఆహార నియమాలు పాటిస్తారు. ఏం తినాలి? ఎంత తినాలి? అని డైట్ ఛార్ట్ మెయింటెయిన్ చేస్తారు. కానీ ఎప్పుడు తినాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయంలో చాలా మంది సూర్యాస్తమయానికి ముందే డిన్నర్ చేయాలని చెబుతుంటారు. ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారని హెచ్చరిస్తారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.
Over Weight Causes : సరైన ఆహార నియమాలు పాటించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు తినే సమయం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇటీవల indian.com అనే సంస్థ జసాన్ విజ్ అనే ఆరోగ్య నిపుణుడి ద్వారా 'అధిక బరువు సమస్య - నివారణ చర్యలు' అనే అంశాన్ని ప్రచురించింది. ఇందులో రాత్రి భోజనం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పారు జసాన్. ఒక్కొక్కరికి ఒక్కో జీవన విధానం ఉంటుందని జసాన్ తెలిపారు. నిజంగా ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే భోజనం చేయాలని.. అంతే తప్ప సరదా కోసం, ఊరికే దొరికింది కాదా అని తినేయడం చేయకూడదని ఆయన సూచించారు. డిన్నర్ చేయడానికి ఏది సరైన సమయమో తెలుసుకునేందుకు పలు అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రాత్రి ఆలస్యంగా భోజనం ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారం జీర్ణం కాకపోవడం
Poor Fat Digestion Effects :సాధారణంగా మనుషులకు సాయంత్రం అయ్యే సరికి ఆహార జీర్ణశక్తి క్రమంగా తగ్గుతుంది. రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, అసౌకర్యం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
కడుపులో మంట
Acid Reflux Causes : ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు తలెత్తుతాయి. జీర్ణాశయంలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన జీర్ణరసాలు పైకి ఎగబాకే అవకాశం ఉంటుంది. అందువల్ల గ్యాస్ట్రో ఈసో ఫ్యాగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ (GERD) వస్తుంది. ఇది కడుపులో మంటకు దారితీస్తుంది.
నిద్రకు ఆటంకం
Causes For Disturbed Sleep : రాత్రి భోజనానికి, నిద్రపోవడానికి మధ్య కొంత విరామం ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా నిద్ర పోవడానికి కాసేపు ముందు భోజనం చేస్తే.. శరీర విశ్రాంతికి ఆటంకం కలుగుతుంది. ఇది నిద్ర రాకపోవడానికి కారణం అవుతుంది.