పిల్లల ఎదుగుదలలో టీనేజీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా 14-20 ఏళ్లు మధ్య పిల్లల్లో హైట్ పెరగడానికి (Weight Loss Tips) ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ వయసు వారు అధిక బరువు ఉంటే అది వారి ఎదుగుదలతో పాటు ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదాహరణకు 14 ఏళ్ల వయసు వారు 45-50 మధ్య ఉండాలని అంతకుమించి ఉంటే (Weight Loss Tips) తరచూ వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు.
ఆ వయసు వారు ఎత్తు పెరగాలంటే బరువు తగ్గాల్సిందేనా? - హెల్త్ టిప్స్
అధిక బరువు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో పిల్లలు టీనేజీకి వచ్చేసరికి (Weight Loss Tips) వారు ఎంత బరువు ఉండాలి. ఎంత ఎత్తు ఉండాలి అనే విషయంపై తల్లిదండ్రుల్లో సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి? దీనిపై నిపుణుల మాటేమిటో తెలుసుకుందాం.
ఆ వయసు వారు బరువు తగ్గితే ఎత్తు పెరుగుతారా?
వ్యాయామంతో పాటు ఆహారపు అలవాట్లను కూడా (Weight Loss Tips) మార్చుకోవాలని తెలిపారు. డీప్ ఫ్రై ఫుడ్స్, స్వీట్స్, చాక్లేట్స్ వంటివి పూర్తిగా మానేయాలని.. ఇవే బరువు పెరగడానికి ప్రధాన కారణమన్నారు. ఈ తరహా అలవాట్లు ఉండటం వల్లే కొందరికి ఈ వయసుకే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేస్తున్నాయని హెచ్చరించారు. తరచూ వ్యాయామం చేస్తూ సరైన డైట్ పాటిస్తే బరువు తగ్గడం సహా మంచి హైట్ పెరుగుతారని చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి :పిల్లలు బరువు తగ్గాలా? అయితే ఇవి పెట్టండి!