Weight Loss Tips: ప్రస్తుత సమాజంలో అధిక బరువు పెద్ద సమస్యగా తయారైంది. దీనిని అదిగమించడానికి మానసిక సన్నద్ధతతో పాటు శారీరక శ్రమ కూడా అవసరం. ఆహార నియమాలను క్రమం తప్పకుండా పాటించడం వల్ల బరువును తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామంతో పాటు, జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
బరువు తగ్గడానికి పోషకాహార నిపుణుల సూచనలు..
- ప్రతిరోజు సుమారు 40-60 నిమిషాల వ్యాయామం చేయాలి.
- రోజు కనీసం 3-4 లీటర్లు నీరు తాగాలి.
- ఆహారాన్ని ఎక్కువసార్లు తక్కువ మోతాదులో తీసుకోవాలి.
- ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలనే ఎంచుకోవాలి.
- చక్కెర, ఆయిల్, కొవ్వు పదార్థాలు తక్కువుగా ఉండే ఆహార పదార్థాలను అలవాటు చేసుకోవాలి.
- సాల్మన్ చేపలు, బ్రౌన్ రైస్ వంటివి తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు.
- ఉదయం పూట అల్పాహారాన్ని తప్పకుండా తినాలి.
- రోజుకు సుమారు 8 గంటలపాటు నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి.