Weight Loss Tips: బరువు తగ్గాలంటే చాలా విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. ఆహార అలవాట్లు మార్చుకోవాలి. బరువు అదుపులో ఉంచుకునేందుకు వ్యాయామాలు చేయాలి. అయితే ఏ పని చేయకుండా స్తబ్దుగా ఒకే దగ్గర కూర్చున్నవారు బరువు తగ్గేందుకు కొందరు ప్రయత్నిస్తారు. వెయిట్‌లాస్ కోసం తగిన విధంగా డైట్ ప్లాన్ చేసుకుంటారు. రోజు తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. అయితే దీని వల్ల బరువు తగ్గుతారా?
Weight Loss Tips: పెద్దగా కష్టపడకుండానే బరువు తగ్గేయండిలా!
Weight loss tips: బరువు తగ్గేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి అనుసరిస్తారు. ఒకరు డైట్ పేరుతో కడుపు మాడ్చుకుంటే.. మరికొందరు జిమ్‌కు వెళ్లి గంటల తరబడి కసరత్తులు చేస్తుంటారు. ఇలాంటివి చేయడానికి ఇష్టంలేని వారు రోజువారీ ఆహారంలో తక్కువ కేలరీలు తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. అయితే దీని వల్ల బరువు తగ్గుతారా?
ఎత్తుగా తగ్గ బరువు ఉంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు బరువు తగ్గేందుకు తగిన డైట్‌తో పాటు చిన్నచిన్న వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అయితే రోజూ తక్కువ మోతాదు కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్నా.. క్రమంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు 1400 నుంచి 1500 కేలరీల మధ్య ఆహారం తీసుకోవడం.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా క్రమంగా బరువు తగ్గుతారని పేర్కొన్నారు. అయితే శారీరక వ్యాయామం చేసేవారు ఇంకాస్త ఎక్కువ కేలరీలు తీసుకోడం మేలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:'ఆరోగ్యానికి 10 వేల అడుగులు'.. నిజమా? అపోహా?