తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వేడి నీటి కోసం హీటర్ వాడుతున్నారా? ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త!

Water Heater Precautions in Telugu : మీరు వేడి నీళ్ల కోసం వాటర్‌ హీటర్‌ ఉపయోగిస్తున్నారా? మరి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? లేదంటే మాత్రం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది..!

Water Heater Precautions In Telugu
Water Heater Precautions In Telugu

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 5:15 PM IST

Water Heater Precautions In Telugu : చలికాలం వచ్చిందంటే చాలు.. చన్నీటితో ముఖం కడుక్కోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటిది స్నానం చేయాలంటే "వణికి"పోతారు. అందుకే.. ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు. అయితే.. గతంలో కట్టెల పొయ్యిల మీద నీళ్లను వేడి చేసుకునేవారు. ఇప్పుడు ప్రతి వంటింట్లోకి గ్యాస్​ బండ రావడంతో.. కట్టెల పొయ్యిలు కనిపించకుండా పోయాయి. పోనీ.. గ్యాస్​ మీద వేడిచేద్దామంటే.. బండ త్వరగా ఖాళీ అయిపోతుంది. అందుకే.. చాలా మంది నీటిని వేడి చేసేందుకు వాటర్‌ హీటర్లు ఉపయోగిస్తుంటారు.

ఇంట్లో గీజర్‌లు, సోలర్‌ వాటర్‌ హీటర్‌లు ఏర్పాటు చేసుకోలేని వారు ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నారు. తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే.. వాటర్‌ హీటర్లను ఉపయోగించేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఈ హీటర్‌లను వాడేటప్పడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి సురక్షితంగా ఉండొచ్చో పలు సూచనలు చేస్తున్నారు. మరి అవేంటో..ఈ కథనంలో తెలుసుకుందాం.

హీటర్లను ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • వాటర్‌ హీటర్లను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లగ్​లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేదంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.
  • చిన్న పిల్లలు ఆడుకునే చోట.. హీటర్​తో నీళ్లను వేడిచేయకూడదు. ఇంట్లో ఎక్కడ పెట్టినా.. స్విచ్ ఆఫ్​ చేసే వరకూ ఓ కంట కనిపెడుతుండాలి.
  • వాటర్‌ హీటర్‌లను బాత్‌రూమ్‌లో పెట్టుకోకూడదు. ఎందుకంటే అక్కడ అంతా తడితో ఉంటుంది కాబట్టి, షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
  • వాటర్ హీటర్​ రాడ్‌లు మాన్యువల్‌గా పనిచేస్తాయి. వీటిలో ఆటో స్విచ్చాఫ్ ఆప్షన్ ఉండదు. కాబట్టి, వీటిని ఆన్‌ చేసిన కొంత సమయం తరువాత ఆఫ్‌ చేయాలి.
  • ఇమ్మర్షన్ రాడ్‌ పూర్తిగా నీటిలో మునిగిన తరవాతనే.. స్విఛ్‌ ఆన్ చెయ్యాలి.
  • బకెట్లో నీరు వేడెక్కిందో లేదో తెలుసుకోవాలని.. నీటిలో వేలు పెట్టొద్దు. దీనివల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.
  • హీటర్ స్విచ్ ఆఫ్ చేసి కూడా నీటి వేడిని టెస్ట్ చేయకూడదు. పూర్తిగా అన్​ ప్లగ్​ చేసిన తర్వాతనే చేత్తో వేడిని చెక్ చేసుకోవాలి.
  • అదేవిధంగా.. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత.. 10 సెకండ్ల తర్వాత హీటర్ రాడ్డును నీటి నుంచి తీయడం మంచిది.
  • ఇనుము ద్వారా కరెంట్‌ ప్రవహిస్తుంది కాబట్టి, వాటర్ హీటర్‌లను మెటల్ బకెట్‌లో పెట్టవద్దు.
  • నీటిని వేడి చేసుకోవడానికి ప్లాస్టిక్ బకెట్‌ను ఉపయోగించడం మంచిది.
  • మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే వాటర్ హీటర్‌లను కొనుగోలు చేయవద్దు. వీటిలో అంతగా నాణ్యత ఉండదు. అందు వల్ల షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.
  • వాటర్‌ హీటర్‌ని ఉపయోగించేటప్పుడు తడి చేతులతో, తడి బట్టలతో ముట్టుకోకూడదు. ఇలా చేయడం వల్ల షాక్‌ తగిలే ప్రమాదం ఉంటుంది.
  • వాటర్‌ హీటర్‌ను రెగ్యులర్‌గా సర్వీస్ చేయించాలి. దీనివల్ల ఏమైనా సమస్యలు ఉంటే ముందే గుర్తించి పరిష్కరించవచ్చు.
  • చాలా కాలంగా ఉపయోగించే పాత వాటర్‌ హీటర్‌లతో ప్రమాదం పొంచి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details