Walking Without Chappal Benefits : పూర్వకాలంలో కాళ్లకు చెప్పుల్లేకుండా తిరిగారు కానీ.. నేటి ఆధునిక యుగంలో పాదరక్షలు వేసుకోకుండా బయటికి వెళ్లలేం. బయటి సంగతి పక్కన పెడితే.. కొందరు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాటిని ఉపయోగిస్తారు. అయితే.. పాదరక్షలు లేకుండా నడిస్తే ఏమవుతుంది? దాని వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా? అని మీకెప్పుడైనా సందేహం వచ్చిందా ? దానికి సమాధానం ఇదిగో.
Benefits Of Walking Without Footwear :ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో దీనికి సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాదరక్షలు లేకుండా నడవటాన్ని గ్రౌండింగ్, ఎర్తింగ్ అని కూడా పిలుస్తారు. మన శరీరానికి భూమికి నేరుగా సంబంధం ఉండే ఈ ప్రక్రియ వల్ల శరీర ఆరోగ్యంతో పాటు మానసిక ఆర్యోగ్యంపైనా సానుకూల ప్రభావం ఉంటుంది. మరి వీటితో పాటు ఇంకా ఏమేం ఉంటాయో తెలుసుకుందాం.
Benefits Of Walking Without Slippers : పాదరక్షలు లేకుండా నడవడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనాల్లో ఒకటి శరీరంలో మంటను తగ్గించే సామర్థ్యం. భూమి ఉపరితలం ఫ్రీ ఎలక్ట్రాన్ల సరఫరా కలిగి ఉంటుంది. మనం చెప్పుల్లేకుండా నడిచినప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్లు... మన శరీరంలో హానికరమైన, ఇన్ ఫ్లమేషన్కు కారణమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. ఫలితంగా ఈ గ్రౌండింగ్ ప్రక్రియ ద్వారా ఇన్ఫ్లమేషన్ను గణనీయంగా తగ్గించుకోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీని వల్ల దీర్ఘకాలిక నొప్పులు తగ్గడమే కాకుండా రోగనిరోధక ప్రతిస్పందన సైతం పెరుగుతుంది.
Walking Barefoot For Heart : చెప్పులు లేకుండా నడవడం మన హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రక్రియ రక్త ప్రసరణ, హృదయ స్పందన మార్పులకు అనుసంధానమై ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటు, ఇతర శారీరక విధులను నియంత్రిస్తుంది. పాదరక్షలు ధరించకుండా నడవడం ద్వారా ఆరోగ్యకరమైన హృదయ స్పందన లయ పెంపొందుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని దూరం చేసి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.