Walking Vs Yoga Which Is Best For Weight Loss : ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా విపరీతంగా బరువు పెరుగుతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. బడికెళ్లే వయసు నుంచే ఒత్తిడి పెరగడం, శారీరక శ్రమ లేని ఉద్యోగంలో గంటలు గంటలు కూర్చోని పని చేయడం.. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వంటివి అధిక బరువుకు కారణమవుతున్నాయి. చాలామంది ఈ సమస్య నుంచి బయట పడటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొద్దిమంది నడక మొదలుపెడితే.. మరికొద్దిమంది యోగాసనాలు వేస్తారు. ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెటర్ అనే డౌట్ చాలా మందికి వస్తుంది. మరి ఈ ప్రశ్నకు నిపుణులు ఏం అంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం..
నడక వల్ల కలిగే లాభాలు :వాకింగ్, యోగా ఈ రెండింటి వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు.జిమ్‌కు వెళ్లడం ఇష్టం లేని వారికి వాకింగ్ ఒక మంచి ఎంపిక. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేస్తుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అదనపు క్యాలరీలు, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు తక్కువ సమయంలోనే కరుగుతుంది. అలాగే వాకింగ్ వల్ల మీ కండరాలు దృఢంగా మారుతాయి. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి, భయం, కోపం వంటి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండవచ్చు. శరీరం ఫిట్‌గా ఉంటే గుండె జబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులుదరిచేరవు. మీరు రెగ్యులర్‌గా మార్నింగ్ వాకింగ్ చేస్తూ సమతుల ఆహారం తీసుకుంటే ఈజీగా బరువు తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు.
ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని వర్క్ చేస్తున్నారా? బీ కేర్ ఫుల్- ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే!