Walk After Dinner Good Or Bad : మనం భోజనం చేసిన ప్రతిసారీ జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో మన కడుపుకు రక్త ప్రసరణ అవసరం. ఏదైనా మీల్, స్నాక్స్ తర్వాత ఏదైనా పని చేస్తే రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది క్రమంగా అసిడిటీ, మలబద్దకం, అజీర్తి, ఊబకాయం తదితర సమస్యలకు దారితీస్తుంది. కానీ అదే సమయంలో భోజనానంతరం షుగర్ నియంత్రణలో ఉండేందుకు ఏదైనా ఆక్టివిటీ చేయడం మంచిది.
walk after dinner benefits : అందుకే చాలా మంది తిన్నాక వాకింగ్చేస్తారు. ఇది మీ శరీరంపై తక్కువ ప్రభావం చూపే వ్యాయామం. సులభంగా ఎక్కడైనా చేయవచ్చు. కాబట్టి తిన్న తర్వాత నడిస్తే కొన్ని ప్రయోజనాలున్నాయి. వాకింగ్ అనేది మన కడుపు, పేగుల్ని ఉత్తేజపరుస్తుంది. దీని వల్ల శరీరం సులభంగా పోషకాలు శోషించుకుంటుంది. ఫలితంగా ఆహారం సైతం త్వరగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
భోజనం తర్వాత..
Walk After Dinner After How Much Time : భోజనం తర్వాత నడిస్తే వచ్చే ప్రయోజనాల గురించి స్పోర్ట్స్ అనే జర్నల్ ఒక అధ్యయనం జరిపింది. అందులో తెలిసిన వివరాల ప్రకారం.. భోజనం తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగి తగ్గుతాయి. అనంతరం ఇన్సులెన్స్ స్థాయి స్థిరంగా మారుతుంది. భోజనం చేసిన తర్వాత రెండు నుంచి అయిదు నిమిషాల స్వల్ప నడక అవసరమని పలువురు నిపుణులు తెలిపారు. ఎందుకంటే మీల్ తర్వాత 60 నుంచి 90 నిమిషాల వ్యవధిలో మన బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగతాయి. వాకింగ్ బీపీ కంట్రోల్లో ఉండటానికి సాయపడుతుంది.
మరో ప్రయోజనం కూడా..
Walk After Meal Or Before : మీల్స్ తర్వాత నడకతో మరో ప్రయోజనం కూడా ఉంది. భోజనానంతరం రోజూ నడవటం వల్ల క్యాలరీలు ఖర్చ అయ్యి బరువు పెరగకుండా ఉంటారు. ఆ అధ్యయనం ప్రకారం.. రోజూ కనీసం 30 నిమిషాలు తేలికపాటి వేగంతో నడిస్తే 150 క్యాలరీల వరకు ఖర్చవుతాయి. భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత నడవడం ప్రారంభిస్తే బాగుటుందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఒక వేళ అతిగా తింటే ఇంకా కొంచెం ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకుని తర్వాత నడవాలి. హడావుడిగా కాకుండా శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ రిల్సాక్స్గా నడవాలి.
చామంతి టీ తాగితే..
Walk After Eating Benefits : భోజనం అయిన గంట తర్వాత మీరు.. అల్లం, పుదీనా, జాజికాయ, బెల్లం కలిపిన చామంతి టీని తాగొచ్చు. ఇది మీ నడక ప్రయోజనాల్ని మరింత పెంచుతుంది. తిన్నాక వజ్రాసనంలో కాసేపు కూర్చోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఈ ఆసనంలో కూర్చుని ముక్కుతో మెల్లగా శ్వాస తీసుకుని నోటితో వదలాలి. దీనివల్ల రోజు వారీ పనుల్లో కలిగిన ఒత్తిడి, చిరాకు నుంచి ఉపశమనం కలుగుతుంది. అదే సమయంలో ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ లాంటి సంతోషకరమైన హార్మోన్ల స్థాయిల్ని పెంచుతుంది. సున్నితమైన నడక.. మీరు సంతోషంగా, ఎక్కువసేపు నిద్రపోవడానికి సహాయపడుతుంది.