శృంగారం అంటేనే ఓ మధురమైన అనుభూతి. రతిక్రీడలో ప్రతి ఒక్కరూ ఎక్కువసేపు పాల్గొనాలని కోరుకుంటారు. భాగస్వామిని సంతృప్తి పరచడానికి ప్రయత్నింస్తుటారు. అందుకోసం సెక్స్ పవర్‌ను పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు చాలా మంది విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటే సెక్స్ పవర్ పెరుగుతుందని అనుకుంటారు. అసలు నిజంగానే విటమిన్ మాత్రలు వేసుకుంటే సెక్స్ పవర్ పెరుగుతుందా? ఇంతకీ విటమిన్ టాబ్లెట్లు వేసుకోవచ్చా? ఆరోగ్యానికి మంచిదేనా? వీటిపై నిపుణులు ఏమని చెబుతున్నారంటే..
"సాధారణంగా మన శరీరానికి విటమిన్లు అవసరం. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. కొన్నిసార్లు విటమిన్లు మన బాడీలో తక్కువైతే యాంటీ ఆక్సిన్స్.. మనిషిని హుషారు లేకుండా చేస్తాయి. అందువల్ల నరాలు కూడా బలహీనంగా మారుతాయి. అందుకే విటమిన్ సీ, ఈ, డీ ఎక్కువగా తీసుకుంటే ఆక్సిడెట్ స్ట్రెస్ తగ్గుతుంది. పళ్లు, పాలు, ఆకుకూరల్లో సహజంగా విటమిన్స్ లభిస్తాయి. అందుకే వాటిని తినాలి. అయితే విటమిన్ మాత్రలు కూడా మామూలుగా వేసుకోవచ్చు. అవి మనిషిని హుషారుగా ఉంచుతాయి. అయితే అవి వేసుకుంటేనే సెక్స్ పవర్ పెరుగుతుందని చెప్పలేం. కానీ ఆరోగ్య అవసరాల దృష్ట్యా వాడొచ్చు" అని నిపుణులు చెప్పారు.