Vitamin K Benefits In Telugu : ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన విటమిన్లు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. విటమిన్లు సరిగ్గా అందకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ల లోపం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుంది. విటమిన్లలో 'విటమిన్ K'కు కూడా అధిక ప్రాధాన్యత ఉంది. విటమిన్ కె వల్ల ఉపయోగాలేంటి? ఆహారంలో ఎందుకు తప్పనిసరిగా తీసుకోవాలి? అనేది ఇప్పుడు చూద్దాం.
విటమిన్ కె అనేది శరీరానికి చాలా అవసరం. విటమిన్ కె లోపం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. రక్తం గడ్డకట్టడం, రక్తంలో క్యాల్షియంస్థాయిలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. అలాగేఎముకల ఆరోగ్యానికి అవసరమైన ప్రోథ్రాంబిన్ అనే ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడానికి విటమిన్ కె అవసరమవుతుంది.
విటమిన్ కె ప్రాథమిక ఆహాన వనరు విటమిన్ కె1. దీనిని ఫైలోక్వినోన్ అని కూడా పిలుస్తారు. మొక్కల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విటమిన్ కె మరో మూలం విటమిన్ కె2. దీనిని మెనాక్వినోన్ అని కూడా పిలుస్తారు. ఇవి జంతు ఆధారిత, పులియబెట్టిన ఆహారాల్లో లభిస్తుంది.
విటమిన్ కె లోపం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఈ విటమిన్ తక్కువ కావడం వల్ల అధిక రక్తస్రావం అవుతుంది. అదే విటమిన్ కె మీ శరీరంలో పుష్కలంగా ఉంటే ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావం కాకుండా రక్తం గడ్డం కట్టేలా సహాయపడుతుంది. ఇంకా విటమిన్ కె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఎముకల ఆరోగ్యం కోసం విటమిన్ కె
Vitamin K For Bones : విటమిన్ కె తీసుకోవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ధృఢమైన ఎముకల సంరక్షణకు ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. అలాగే ఎముకల సాంద్రతను మెరుగుపర్చడంతో పాటు పగుళ్ల ప్రమాదానికి తగ్గిస్తుంది.