Vitamin Deficiencies also Reason for Hair Fall: అందంగా కనిపించాలంటే ముఖవర్చస్సు ఎంతో ఇంపార్టెంటో.. మృదువైన, కోమలమైన జుట్టు కూడా అంతే ముఖ్యం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం.. దీనికి వయస్సు, జెండర్తో సంబంధమే లేదు. కాగా, చాలా మంది జుట్టు ఊడటాన్ని తేలికగా తీసుకుంటారు. అదే పెరుగుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తారు. అసలు జుట్టు రాలడానికి కారణాలు అంటే ఇది అని చెప్పలేం.. కానీ, జుట్టు రాలడానికి ఉన్న ప్రధాన కారణాలలో విటమిన్ లోపాలు కూడా ముఖ్యమైనవని నిపుణులు అంటున్నారు. ఈ కింద విటమిన్లు లోపిస్తే జుట్టు రాలడమనే సమస్య ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు. ఈ విషయంపై పలు అధ్యయనాలు కూడా స్పష్టతనిచ్చాయి.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
విటమిన్-డి:విటమిన్-డి లోపం జుట్టు చాలా పలుచగా మారడానికి దారితీస్తుంది. జుట్టు పెళుసుబారి తెగిపోతుంది. జుట్టు తొందరగా తెల్లగా మారడానికి కారణం అవుతుంది. దీన్ని రక్తపరీక్ష ద్వారా నిర్థారణ చేసుకోవచ్చు. చేపలు, గుడ్లలో పచ్చ సొన, పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం, లేత సూర్యరశ్మిలో గడపడం వల్ల విటమిన్-డి భర్తీ చేసుకోని.. తద్వారా మెరిసే జుట్టును పొందవచ్చు.
జుట్టు ఎక్కువగా రాలుతోందా? మీరు చేసే ఈ తప్పులే కారణం!
విటమిన్-ఇ:విటమిన్-ఇ లోపిస్తే తల చర్మం డెలికేట్గా మారుతుంది. ఇది జుట్టు కుదుళ్లను, జుట్టు చివర్లను బలహీనం చేసి జుట్టు రాలడానికి కారణం అవుతుంది. విటమిన్-ఇ తక్కువగా ఉంటే బట్టతల, పేనుకొరుకుడు సమస్యలు సులభంగా వస్తాయి. పాలకూర, బాదం, పొద్దు తిరుగుడు విత్తనాలు, అవకాడో మొదలైన విటమిన్ ఇ కలిగిన ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు.
విటమిన్-ఎ:విటమిన్-ఎ లోపం వల్ల జుట్టు పలుచగా మారుతుంది. తద్వారా విపరీతంగా రాలిపోతుంది. తిరిగి జుట్టు పెరగాలంటే టైమ్ చాలా పడుతుంది. అదే విధంగా జుట్టులో చుండ్రు అధిక మొత్తంలో కనిపించడం వెనుక కారణం కూడా ఇదే. విటమిన్-ఎ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను తీసుకుంటే ఈ సమస్య నుంచి సులువుగానే బయటపడవచ్చు.
అది సాధారణ రోగం కాదు - క్యాన్సర్ కావొచ్చు - ఇలా గుర్తించండి!
విటమిన్-సి:విటమిన్-సి లోపిస్తే జుట్టు పొడిబారడం, జుట్టు చివర్లు చిట్లిపోవడం, రాలిపోవడం, జుట్టు పెరుగుదల మందగించడం, పెళుసుగా మారడం జరుగుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే.. బ్రోకలీ, సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు.. ఇలా మొదలగు ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.