తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

విటమిన్ D లోపం వల్లే ఆ సమస్యలు - ఏమైందో అని భయపడుతుంటారు! - How to Gain Vitamin D

Vitamin D Deficiency : అపార్ట్​ మెంట్ కల్చర్.. రోజంతా ఆఫీసు ఉద్యోగాలు.. వగైరా కారణాలతో చాలా మంది D విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. సమస్య చిన్నదిగానే అనిపించినా.. ఎదుర్కొనే ఇబ్బందులు మామూలుగా ఉండవు! ఈ లక్షణాలతో మీరు కూడా బాధపడుతున్నట్టయితే.. ఓ సారి విటమిన్ లోపం ఉందేమో చెక్ చేసుకోండి.

Vitamin D Deficiency
Vitamin D Deficiency

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 4:38 PM IST

Vitamin D Deficiency Symptoms : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరం ప్రతిరోజూ కనీసం 1,500-2,000 అంతర్జాతీయ యూనిట్లు లేదా IU విటమిన్ Dని పొందాలి. కొవ్వుతో కూడిన చేపలు, బలవర్ధకమైన పాల ఉత్పత్తులు వంటి అనేక ఆహారాలలో ఈ విటమిన్ ఉన్నప్పటికీ.. ఆహారం ద్వారా మాత్రమే పూర్తిగా పొందడం కష్టం. ఎండ నుంచి సహజంగా కూడా పొందాల్సి ఉంటుంది. లేదంటే.. పలు సమస్యలు వేధిస్తాయి.

తరచుగా అనారోగ్యం :బాడీలో ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉంటుందో.. అప్పట్నుంచి తరచూ అనారోగ్యానికి గురవుతారు. అయితే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఇన్​ఫెక్షన్లతో పోరాడే కణాలతో నేరుగా చర్య జరపుతుంది. కాబట్టి ఈ విటమిన్ లోపిస్తే తరచుగా జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడుతారు.

ఎముకల నొప్పి : మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే.. తీవ్రమైన ఎముక నొప్పికి గురవుతారు. అంటే ఈ విటమిన్ లోపంతో సంబంధం ఉన్న ఆస్టియోమలాసియా, బోలు ఎముకల వ్యాధి, రికెట్స్ వంటి వ్యాధులు వస్తాయి. అలాగే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. దీనికి ముఖ్య కారణం విటమిన్ డిలో ఉండే కాల్షియం తగ్గడమే. కాబట్టి ఈ సమస్యలు ఉన్నా వైద్యుడిని సంప్రదించి టెస్టులు చేయించుకోవడం బెటర్.

డిప్రెషన్ : నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ డి లోపం ఉంటే మానసిక సమస్యలు వస్తాయంటున్నారు. ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళన వంటి ఈ విటమిన్ స్థాయిలు తగ్గినట్లు మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.

జుట్టు రాలడం : చాలా మందికి వెంట్రుకలు ఊడిపోతుంటే ముందుగా డిప్రెషన్, కొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ వీటితోపాటు విటమిన్ డి లోపం ఉన్నా జుట్టు రాలుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటితో పాటు వంధ్యత్వం, నిస్సత్తువ, త్వరగా గాయాలు మానకపోవడం వంటివి లక్షణాలు ఉన్నా వైద్యుడిని సంప్రదించి ఈ విటమిన్ టెస్ట్ చేయించుకోవడం బెటర్.

Vitamin D Foods : విట‌మిన్ D లోపమా..? ఈ 5 డ్రింక్స్ తాగితే అంతా సెట్!

విటమిన్ డి లోపానికి కారణాలివే..

విటమిన్ D అసమర్థతకు ఏ ఒక్క కారణం లేకపోయినా.. కొన్ని అంతర్లీన పరిస్థితులు లేదా జీవనశైలి కారకాల ఫలితంగా ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం..

  • ముదురు రంగు చర్మం కలిగి ఉంటారు
  • ఊబకాయం లేదా అధిక బరువు ఉండటం
  • భూమధ్యరేఖకు దూరంగా లేదా ఏడాది పొడవునా సూర్యకాంతి తక్కువగా ఉండే ప్రాంతాలలో నివసించడం.
  • ఎక్కువగా ఇంటి లోపలే ఉండడం.
  • దీర్ఘకాలిక మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధితో బాధపడుతుండడం.

ఈ సమస్య రాకుండా ఎలా జాగ్రత్త పడాలంటే.. విటమిన్ డి స్థాయిల కోసం తరచుగా పరీక్షలు చేయించుకోవాలి. డైలీ విటమిన్ డి కోసం బాడీకి ఉదయం పూట సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. అదేవిధంగా కాంతి తరంగదైర్ఘం గరిష్ఠంగా ఉన్న సమయంలో 11AM నుంచి 2PM వరకు కనీసం 30 నిమిషాల పాటు ఎండ తగిలేలా చూసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. వీటితో పాటు విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

Vitamin C Foods : విట‌మిన్ 'సి' లోపమా? ఇవి తినేయండి.. అంతా సెట్!

Vitamin D Tablets Side Effects : విటమిన్-డి మాత్రలు ఎక్కువగా వాడేస్తున్నారా?.. ఆ '10' లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details