Vitamin C Foods : మనం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి పోషక విలువలు అందించే ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు లభించే ఆహారం ఎక్కువగా తినాలి. విటమిన్ల లోపం వల్ల అనేక వ్యాధులు బారిన పడటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే విటమిన్లు అనేవి శరీరానికి చాలా అవసరం. ముఖ్యంగా శరీరానికి విటమిన్ సి అనేది ఇంకా ముఖ్యం. ఇది శరీరాన్ని వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. దీంతో రోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరికాయ, రేగిపళ్లు
ఉసిరికాయ, రేగిపండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వాటిని తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల రోగనిరోధక శక్తిని కాపాడుకోవడం సహా అనేక వ్యాధులు నుంచి రక్షణ పొందవచ్చు. అందుకే ఉసిరికాయ, రేగిపండ్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి.
నిమ్మజాతి పండ్లు
Vitamin C Fruits : ఇక నిమ్మజాతి పండ్లలో కూడా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ, ఆరెంజ్ వంటి సిట్రస్ జాతికి చెందిన వాటిలో విటమిస్ సి పుష్కలంగా ఉంటుందని అంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోదక శక్తి పెరగడం సహా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతున్నారు.