ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారమే తినాలనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. శాకాహారంతో బరువు తగ్గడమే కాకుండా ఎక్కువ కాలం జీవిస్తారని కొన్ని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. అయితే మాంసాహారం స్థాయిలో.. శాకాహార పదార్థాల్లో ప్రొటీన్లు ఉండవు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంటుంది. గింజలు, విత్తనాలు, చిక్కుళ్లు, పప్పులు, ధాన్యాలు వంటి భిన్నమైన ఆహారాలను తీసుకుంటే శాకాహారులకు ప్రొటీన్లతో పాటు అన్నిరకాల పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శాకాహారులు తీసుకోవాల్సిన ఆహారపదార్థాలేంటే తెలుసుకుందాం.
తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు
- చిక్కుళ్లు
- కూరగాయలు
- క్యారెట్లు
- పుట్టగొడుగులు
- పాలకూర
- గుడ్లు
- పాలు
"శాకాహారం తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని న్యూట్రియెంట్లు అనేవి శాకాహారంలో లభించవు కాబట్టి వీరు సప్లిమెంట్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. విటమిన్ సప్లిమెంట్స్ తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించి తీసుకోవాలి. పన్నీర్, టోఫు, సోయా చంక్స్, మిల్మేకర్, సోయాబీన్స్ అనేవి మన ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే సరైన ప్రొటీన్లు, విటమిన్లు మనం పొందవచ్చు. పప్పులు కూడా ఎక్కువగా తీసుకుంటే సరైన ప్రొటీన్ లభిస్తుంది. శాకాహారుల్లో విటమిన్ బీ12 డెఫిషియెన్సీ ఎక్కువగా ఉంటుంది. సరైన మోతాదులో సప్లిమెంట్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు"