తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చికెన్​లోనే కాదు.. ఈ వెజ్​ ఐటమ్స్​లోనూ ఫుల్​ ప్రోటీన్స్​! - పనస పండు ప్రయోజనాలు

Meat Alternatives For Vegetarians : మాంసం తినడం మానేయడం వల్ల శరీరానికి అవసరయ్యే ప్రోటీన్లు అందవని చాలామంది భయపడుతుంటారు. అయితే.. శాకాహారంలో కూడా ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్లు లభించే శాకాహార పదార్థాలేంటో ఇందులో చూద్దాం.

vegetarian-food-meat-alternatives-and-protein-from-badam-and-chick-peas
శాఖాహారులకు మాంసం ప్రత్యామ్నాయాలు

By

Published : Aug 3, 2023, 7:52 AM IST

Vegetarian Food Meat Alternatives In Telugu : కొంతమంది మాంసాహారాన్ని ఇష్టపడితే.. మరికొందరు శాకాహారాన్ని బాగా ఇష్టంగా తింటారు. కొంతమంది కొద్దిరోజులు మాంసాహారం తిన్న తర్వాత శాకాహారులుగా మారుతుంటారు. అయితే మాంసం తినడం ద్వారా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు, ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని చెబుతుంటారు. శాకాహారం తినడం వల్ల తమ శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు లభించవని కొంతమంది బాధపడుతుంటారు. అయితే అది ఏ మాత్రం నిజం కాదు. ఇలాంటివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శాకాహారం తినడం వల్ల కూడా శరీరానికి అసరమయ్యే మాంసకృత్తులు లభిస్తాయని, మాంసం తినడం ద్వారా లభించే అన్ని పోషకాలు వీటిల్లోనూ దొరుకుతాయని అంటున్నారు. మాంసంకు బదులుగా శాకాహారులు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కల ద్వారా లభించే ఆహారం..
Protein From Plants : శాకాహారులు మొక్కల ద్వారా లభించే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం శరీరానికి ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. చిక్కుళ్లు, పప్పు ధాన్యాలు. పుట్టగొడుగులు, శెనగలు వంటివి తినడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందుతాయి. చిక్కుళ్లు, పుట్టగొడుగులను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

సోయాబిన్, మీల్​మేకర్, డ్రై ఫ్రూట్స్, బీన్స్‌లలో ప్రోటీన్‌తో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలాగే మాంసంలో అమినోయాసిడ్‌తో పాటు ఇనుము, బీ12 ఉంటాయి. అయితే మాంసాహారంలో అధికంగా ఉండే కొవ్వు పదార్థాలు శరీరానికి హాని కలిగించే అవకాశముంది. దీంతో తక్కువ మోతాదులో మాంసాహారాన్ని తీసుకుని ప్రత్యామ్నాయంగా.. శాకారాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పనస పండుతో ప్రయోజనాలెన్నో..!
Jackfruit Benefits In Telugu : ఇక పనస పండులో శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు దొరుకుతాయి. ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

శనగలు, బాదంలో అధిక ప్రోటీన్లు..
Protein From Badam And Chick Peas : ఇక శెనగల్లో అధిక స్ధాయిలో ప్రోటీన్లు ఉంటాయి. అరకప్పు శనగల్లో 7 గ్రాముల ప్రోటీన్లు, ఆరు గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ఒక బాదం పిక్కలో ఒక గ్రాము ప్రోటీన్ ఉంటుంది. దీంతో రోజూ బాదంను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లభిస్తుంది.

పాలు, పెరుగు, మొలకలు, పన్నీరు, గింజలు వంటివి కూడా మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. వీటిల్లో కూడా అధిక మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. రోజూ వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల అధిక ప్రయోజనముంటుంది. మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మాంసాహారాన్ని ఇష్టపడనివారు ప్రోటీన్లు ఉండే పండ్లు, కూరగాయలను మీ ఆహారంలో భాగం చేసుకోండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

చికెన్​లోనే కాదు.. ఈ వెజ్​ ఐటమ్స్​లోనూ ఫుల్​ ప్రోటీన్స్​!

ABOUT THE AUTHOR

...view details