తెలంగాణ

telangana

ఉదయాన్ని ఇలా ఆస్వాదిస్తే.. ఆరోగ్యం మన వశమే!

By

Published : Sep 1, 2020, 10:32 AM IST

రాత్రంతా చేతిలో ఫోన్లు.. దోస్తులతో పార్టీలు.. ఆఫీస్​లో రకరకాల షిఫ్టులు.. కారణమేదైనా పెందలాడే పడుకునే అలవాటు దూరమైంది ఈ తరానికి. ఫలితంగా అరుణోదయం సమయానికి గాఢ నిద్రలో ఉంటున్నాం. పది, పదకొండైనా మేలుకోము అంటున్నాం. అయితే, ఉదయాన్నే నిద్రలేవకపోవడం వల్ల.. స్వచ్ఛమైన చల్లని గాలి, పక్షుల కిలకిలరావాలు, అన్నింటికి మించి డీ విటమిన్ అందించే సూర్యకిరణాలను కోల్పోతున్నామని మరచిపోతున్నాం. మరి, ఈ గజిబిజీ జీవితాల్లో ఉదయాన్ని ఆస్వాదించడమెలాగో చూసేద్దాం రండి.

uses of waking up early in the morning and how to get up early in the morning
ఉదయాన్ని ఇలా ఆస్వాదిస్తే.. ఆరోగ్యం మన వశమే!

కొందరికి ఉదయం లేవడమంటే పరమ చిరాకు. కాలేజీ లేకపోతే తొమ్మిదిగంటలకుగాని కళ్లు తెరవరు. ఇందులో సమస్యలేదు కానీ ఉద్యోగాలంటూ వచ్చాక ఇబ్బందులు తప్పవు. అలాంటివాళ్లు తమను ఇలా మార్చుకోవచ్చు..

లాభాలేమిటీ?

వేకువన నిద్రలేచే అలవాటు లేకపోతే ఏ పని అప్పగించినా మందకొడిగా ఉంటామనే ముద్రమనపై పడిపోతుంది. ఇది అలా ఉంచితే అందాల సూర్యోదయం, వేకువ వాతావరణంలోని నిశ్శబ్దం, ఆ సమయంలో మన మనసుకుండే ఏకాగ్రతా, అందులోని ఆనందం ఇవన్నీ కోల్పోతాం. వేకువన మేల్కోవడంతో వచ్చే ఆ లాభాలన్నీ ఓ చోట రాయండి.

ఉదయాన్ని ఇలా ఆస్వాదిస్తే.. ఆరోగ్యం మన వశమే!

రెండుగంటలపాటు

ఉదయం లేచినప్పట్నుంచి రెండు గంటలపాటు మిమ్మల్ని ఆనందంగా ఉంచగల వివిధ వ్యాపకాల్లో నిమగ్నంకండి. నడక, ఇష్టమైన పుస్తకం చదవడం, రాయడం, చిత్రలేఖనం.. ఇలా ఏదైనా సరే!

‘ఎరుక’ ఉండాలి

ఈ మధ్య ధ్యానంతోపాటూ ఎక్కువగా వినిపిస్తున్న పదం ఈ ‘ఎరుక’(మైండ్‌ఫుల్‌నెస్‌). అంటే.. చేసే ప్రతి పనినీ నిశితంగా ఆస్వాదించడమే. ఉదయం నడుస్తూ చల్లటి గాలీ, పక్షుల కిలకిలరావాలూ తనివితీరా ఆస్వాదించండి. అద్భుతంగా అనిపిస్తుంది.

మూడువారాలు

మూడువారాలు.. అంతరాయం లేకుండా త్వరగా నిద్రలేవండి. క్రమంగా వేకునే మేల్కొనడం మీ దినచర్యలో భాగమవుతుంది.

ఇదీ చదవండి: వదనం మధురం.. మచ్చలు దూరం!

ABOUT THE AUTHOR

...view details