చర్మ సౌందర్యం ఎంతో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అయితే కొందరు మహిళల్లో అవాంఛిత రోమాలు (Unwanted hair Treatment) ఎబ్బెట్టుగా ఉంటాయి. వాటిని తొలగించడానికి త్రెడ్డింగ్, వాక్సింగ్ వంటి పలు (laser hair removal treatment) విధానాలను అనుసరిస్తారు. దీనివల్ల చర్మం నల్లగా తయారవటం, మొటిమలు, నొప్పి, రోమాలు ఇంకా ఎక్కువగా రావటం వంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. ఈ సమస్యలు ఏవీ లేకుండా అవాంఛిత రోమాలు తొలగించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం (laser hair removal side effects) లేజర్ హెయిర్ రిమూవల్.
అవాంఛిత రోమాలు తొలగిస్తే మొటిమలు వస్తున్నాయా? - అవాంఛిత రోమాలకు చికిత్స
కొంతమంది మహిళలకు అవాంఛిత రోమాలు (Unwanted hair Treatment) వస్తుంటాయి. ఇవి చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉంటాయి. వాటిని తీసేయడానికి పలు విధానాలను అనుసరిస్తారు. అయితే.. వీటి వల్ల మొటిమలు, చర్మం నల్లగా అవటం వంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తుంటాయి. అలాంటివారు ఏం చేయాలంటే?
అవాంఛిత రోమాలకు చికిత్స
లేజర్ హెయిర్ రిమూవల్
- కేవలం నల్లగా ఉండే హెయిర్ మీదనే(laser hair removal treatment) ఇది పనిచేస్తుంది.
- లేజర్లో ఉండే లైట్ ఎనర్జీ వల్ల హెయిర్ చాలా నెమ్మదిగా పెరుగుతుంది.
- ఇది శాశ్వత పరిష్కారం కాదు. త్రెడ్డింగ్ ద్వారా అవాంఛిత రోమాలు నెలకే మళ్లీ పెరిగితే.. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఆ గడువు మూడు నెలలకు పెరుగుతుంది.
- 16 వయస్సు నుంచి పైనున్నవారు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
- తరుచుగా చేయించుకుంటే రోమాల మందం తగ్గిపోతుంది. మంచి ఫలితం కనిపిస్తుంది.
- కొంత మందిలో హెయిర్ మందంగా ఉంటుంది. పీరియడ్స్ సరిగా ఉండకపోవడం తదితర సమస్యలు ఉంటాయి. అలాంటివారిలో హార్మోన్ల సమతుల్యం అవసరం. డాక్టర్ను సంప్రదించాలి.
- తెల్లని వెంట్రుకలు వచ్చే వారికి ఎలక్రోలసిస్ అనే పద్దతి ఉంటుంది. ఇది శాశ్వత పరిష్కారం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కానీ చాలా సమయం తీసుకుంటుంది.
- లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకున్న తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం.
ఇదీ చదవండి:అవాంఛిత రోమాలు పెరగకుండా చిట్కాలు..