కరోనా నుంచి కోలుకున్న వారిని మరో కొత్త సమస్య వెంటాడుతోంది. గుజరాత్ సూరత్‌లో వైరస్ బారినపడి కోలుకున్న యువతలో తీవ్ర దుష్ప్రభావాలు కనిపించడం షాకింగ్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. నగరంలోని కరోనా బాధితుల్లో 50నుంచి 60 శాతం మందిలో డీ-డైమర్ ఓ మోస్తరుగా ఉన్నట్లు గుర్తించామని ప్రముఖ హృద్రోగ వైద్యులు డా.అతుల్ అభ్యంకర్ ఈటీవీ భారత్‌కు తెలిపారు. అయితే 10 నుంచి 15శాతం బాధితుల్లో డీ-డైమర్ అధిక స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే మరణానికి దారితీస్తుందని వివరించారు. కరోనా దుష్ప్రభావాల కారణంగా ఎంతో మంది చనిపోతున్నారని, యువతలో డీ-డైమర్ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. గుండె సమస్యలు ఉన్నవారే అధికంగా ప్రభావితమవుతున్నట్లు పేర్కొన్నారు.
కరోనాను జయించాక ఆ టెస్ట్ చేయించుకోవాలా? - Tumours in lungs
కరోనా నుంచి కోలుకున్న వారికి మరో ముప్పు పొంచి ఉండటం ఆందోళనకరంగా మారింది. కొవిడ్‌ను జయించిన వారికి కొన్ని దుష్ప్రభావాలు ప్రాణాంతకంగా మారుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరు చనిపోతున్నారని అంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం వారి ఊపిరితిత్తులు, గుండె, మెదడులో గడ్డలు ఏర్పడటమేనని చెబుతున్నారు. దీన్ని అధిగమించాలంటే కరోనా బాధితులు డీ-డైమర్ టెస్టు చేయించుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించాలని సలహా ఇస్తున్నారు.
![కరోనాను జయించాక ఆ టెస్ట్ చేయించుకోవాలా? 'Tumours in the lungs, heart or brain after recovery from Covid-19'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11734670-thumbnail-3x2-dimer.jpg)
కరోనాను జయించిన వారి ఊపిరితిత్తులు, మెదడులో గడ్డలు!
డీ-డైమర్ టెస్టు గురించి డా.అతుల్ అభ్యంకర్ ఏం చెప్పారో చూద్దాం..
Last Updated : May 13, 2021, 1:17 PM IST