Tulsi Water Health Benefits : భారతీయులు పూజించే మొక్కల్లో తులసి అత్యంత ముఖ్యమైనది. హిందూ సంస్కృతిలో తులసిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీనిని పలు ఆయుర్వేద చికిత్సల‌్లో వాడతారు. అందుకే ఈ మొక్కను ఆయుర్వేద గోల్డెన్ రెమెడీ, క్వీన్ ఆఫ్ హెర్బల్స్ అని అభివర్ణిస్తారు. తులసి జలాన్ని తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ముంబయిలోని రిజువా ఎనర్జీ సెంటర్లో.. పోషకాహార నిపుణులుగా పనిచేస్తున్న డా. నిరుపమరావు తెలిపారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి!
Tulsi Antioxidants : తులసిలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ లాంటి పలు సమ్మేళనాలు ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సాయపడతాయి. తద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది!
Tulsi Immunity Power : తులసి ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంది. అంటే ఇది శరీరంలో రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది. తులసి ఆకులు కలిపిన నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. అంతేకాకుండా మనకు పలు రకాల ఇన్ఫెక్షన్లు సోకకుండా తులసి కాపాడుతుంది.
3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది!
Tulsi Water Digestion Booster : ఈ తులసి మొక్కలో కార్మినేటివ్ లక్షణాలున్నాయి. ఇవి మన జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. తులసి నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది. ఉదయం లేచింది మొదలు.. రోజంతా తులసి నీటిని తాగడం వల్ల అది టాక్సిక్ పదార్థాలు, సూక్ష్మక్రిములను బయటకు పంపుతుంది. ఫలితంగా జీర్ణ రుగ్మతల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది.
4. ఒత్తిడి నుండి ఉపశమనం!
Tension Relief With Tulsi Leaves : తులసి మొక్కను ఒక అడాప్టోజెనిక్ హెర్బ్‌గా పరిగణిస్తారు. ఇది ఒత్తిడిని దూరం చేసి మనస్సుకు ప్రశాంతత చేకూరుస్తుంది. అందువల్ల తులసి నీటిని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు.
5. శ్వాసకోశ సమస్యలు దూరం!
Tulsi Medicinal Uses :దగ్గు, జలుబు, ఉబ్బసం లాంటి శ్వాస కోశ సమస్యలను తగ్గించడానికి తులసిని ఉపయోగిస్తారు. తులసి నీటిని తాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇందులోని ఎక్స్‌పెక్టరెంట్, యాంటిట్యూసివ్లు.. కఫం, జలుబు నివారణలో తోడ్పడతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ముఖ్యమైన నూనెలు వాపు తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి.
6. నోటి ఆరోగ్యం
Benefits Of Tulsi : తులసిలో యాంటీ-మైక్రోబియల్ లక్షణాలున్నాయి. ఇవి నోటి ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడానికి, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో తోడ్పడతాయి. తులసి నీళ్లతో పుక్కిలించడం వల్ల మన చిగుళ్లు ఆరోగ్యంగా ఉండటం సహా నోటి దుర్వాసన తగ్గుతుంది. తులసిలో శరీరంలోని విషపదార్థాలను బయటి పంపే లక్షణాలు ఉన్నాయి.