తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే! - etv bharat health

తళుకులీనే ముఖ సౌందర్యం సొంతంకావాలని ఎవరు కోరుకోరు చెప్పండి? అందుకేగా క్రీములు, ఫేషియల్స్ అంటూ రకరకాల ఉత్పత్తులను వాడేది. కానీ, అవేవీ లేకున్నా సహజసిద్ధంగా మీ ముఖం కళకళలాడాలంటే ఆవిరిపట్టాలి. అవునండీ, జలుబు చేసినప్పుడు మన పెద్దలు పట్టించే ఆవిరి లాంటిదే కానీ.. అది ఆరోగ్యం పొందడానికి, ఇది అందం పెరగడానికి అంతే తేడా... మిగతాదంతా సేమ్ టు సేమ్. మరింకెందుకు ఆలస్యం ఆవిరిపట్టే పద్ధతి, దాని ఫలితాలు చూసేయండి...

try steaming for healthy faceial skin
ఇలా ఆవిరిపడితే ముఖం వెలిగిపోవాల్సిందే!

By

Published : Aug 5, 2020, 10:31 AM IST

కాలమేదైనా కొంతమందికి చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా మారడం సహజమే. అలాంటి వారికి స్టీమింగ్‌ ప్రక్రియ ఎంతగానో ఉపకరిస్తుంది. ఆవిరిపట్టడం వల్ల తేమను కోల్పోయి నిర్జీవంగా మారిన చర్మం స్టీమింగ్‌ తిరిగి ఊపిరిపీల్చుకుంటుంది.

‘స్టీమింగ్‌’తో సౌందర్యం!

వారానికి రెండు సార్లు..

వారానికి ఒకటి లేదా రెండుసార్లు ముఖానికి ఆవిరి పట్టాలి. ఇందుకోసం మనకు కావాల్సింది ఒక గిన్నె నిండా మరిగించిన నీళ్లు, టవల్‌. వేడి నీళ్లతో ముఖానికి ఆవిరి పట్టే క్రమంలో టవల్‌ను తలపై నుంచి కవర్‌ చేసుకుంటే సరి. ఈ ప్రక్రియతో చర్మం తేమను సంతరించుకొని కాంతులీనుతుంది..' అని చెబుతున్నారు అందాల తారలు.

‘స్టీమింగ్‌’తో సౌందర్యం!

తేమను కోల్పోయి నిర్జీవంగా మారిన చర్మాన్ని పునరుత్తేజితం చేయడమే కాదు.. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ఇంకెన్నో సౌందర్య ప్రయోజనాలు చేకూరతాయి. అవేంటంటే..!

  • వాతావరణంలోని దుమ్ము, ధూళి చర్మ రంధ్రాల్లోకి చేరి అవి మూసుకుపోవడం వల్ల మృతకణాలు ఏర్పడతాయి. అలా జరగకుండా ఉండాలంటే వారానికి రెండుసార్లు ముఖానికి ఆవిరి పట్టాలి. స్టీమింగ్‌ వల్ల చర్మ రంధ్రాలు తెరచుకొని అందులోని దుమ్ము, ధూళి, ఇతర మలినాలు తొలగిపోతాయి. తద్వారా చర్మం శుభ్రపడుతుంది.
  • ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. తద్వారా చర్మం ప్రకాశవంతంగా, నవయవ్వనంగా మారుతుంది.
    ‘స్టీమింగ్‌’తో సౌందర్యం!
  • మనం ఫేషియల్‌ చేయించుకునేటప్పుడు ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత ఆవిరి పట్టడం కామనే. ఇలా చేయడం వల్ల ఫేషియల్‌ కోసం ఉపయోగించే క్రీమ్స్‌, ఇతర పదార్థాలు చర్మంలోకి చక్కగా ఇంకుతాయి. తద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది. అందుకే ఇంట్లో ఫేస్‌ప్యాక్స్‌, ఫేస్‌మాస్కులు వేసుకునే ముందు కూడా ఆవిరి పట్టుకోవడం మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. తద్వారా ఆయా పదార్థాలు చర్మ రంధ్రాల్లోకి ఇంకి సత్వర ఫలితాలు పొందొచ్చు.
  • మొటిమల్ని మాయం చేసే శక్తి స్టీమింగ్‌కి ఉంది. అదెలా అంటారా..? ముందుగా ఐదు నిమిషాల పాటు ముఖానికి ఆవిరి పట్టాలి. ఆపై ఓ ఐస్‌క్యూబ్‌ తీసుకొని మొటిమ ఉన్న చోట అరగంట పాటు నెమ్మదిగా రుద్దుతుండాలి. ఇలా చేయడం వల్ల మొటిమ క్రమంగా తగ్గిపోతుంది. లేదంటే మరుసటి రోజుకు మరింత పెద్దదై మన ముఖాన్ని అందవిహీనంగా మార్చేస్తుంది.
  • మేకప్‌ రిమూవర్‌తో మేకప్‌ తొలగించుకున్నప్పటికీ కొన్నిసార్లు చర్మ రంధ్రాల్లో మేకప్‌ అవశేషాలు అలాగే ఉండిపోతాయి. వాటిని తొలగించడానికి సులభమైన మార్గం ఇంకేముంది.. ముఖానికి ఆవిరి పట్టడమే!
  • చర్మ ఆరోగ్యానికి కారణమైన కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచడంలో స్టీమింగ్‌ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే చర్మానికి సాగే గుణాన్ని అందించి నవయవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
  • మనం ఒత్తిడి, ఆందోళనలకు గురైనప్పుడు దాని ప్రభావం ముఖంపై కూడా కనిపిస్తుంది. ఈ క్రమంలో ముఖ చర్మం రిలాక్స్‌ కావాలంటే ఆవిరి పట్టాల్సిందే! ఇలా ఆవిరి పట్టే నీటిలో కొన్ని చుక్కల ఏదైనా ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసుకుంటే మరీ మంచిది.
  • ఆవిరి పట్టడం వల్ల చర్మం తేమను సంతరించుకుంటుంది. ఫలితంగా నూనెలు విడుదలై చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి.
‘స్టీమింగ్‌’తో సౌందర్యం!

చూశారుగా.. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ఎన్ని సౌందర్య ప్రయోజనాలు చేకూరతాయో! అందుకే వారానికి రెండుసార్లు.. అంత సమయం లేదనుకున్న వాళ్లు కనీసం ఒక్కసారైనా స్టీమింగ్‌ పద్ధతిని ఫాలో అవడం మంచిది. అయితే ముఖానికి ఆవిరి పట్టే క్రమంలో మనం ఉపయోగించే వేడి నీటికి మన ముఖాన్ని మరీ దగ్గరగా తీసుకెళ్లకుండా కాస్త దూరంగా ఉంచే ఆవిరి పట్టడం శ్రేయస్కరం. ఈ సమస్యలన్నీ ఎందుకు.. ఇంకాస్త ఈజీగా ఆవిరి పట్టాలనుకున్న వారు మార్కెట్లో దొరికే విభిన్న రకాల 'ఫేషియల్‌ స్టీమర్స్‌'ని ఎంచుకోవచ్చు.. ఇక వీటితో మరింత సులభంగా ముఖానికి ఆవిరి పట్టొచ్చు.. అందంగా మెరిసిపోవచ్చు.. ఏమంటారు?

ఇదీ చదవండి: దోమలను ఆయుర్వేదంతో అంతం చేయండిలా!

ABOUT THE AUTHOR

...view details