తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

గుమ్మడికాయతో క్యాన్సర్లకు చెక్​! - గుమ్మడికాయలో బీటా కెరొటిన్​

Benefits of Pumpkin: సాంబారులో వేసుకునో.. హల్వా చేసుకునో గుమ్మడికాయ రుచులను ఆస్వాదించటం కొత్తేమీ కాదు. మరి దీనిలోని పోషకాల గురించి.. వాటితో ఒనగూడే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

pumpkin
గుమ్మడికాయ

By

Published : Apr 9, 2022, 7:54 AM IST

Benefits of Pumpkin: గుమ్మడికాయ అనగానే సాంబార్​లో వేసుకోనో.. హల్వా చేసుకోవడానికో ఉపయోగిస్తాం. అదే మనకి తెలుసు. గుమ్మడికాయ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో బీటా కెరొటిన్​ పుష్కలంగా ఉంటుందని తెలిపారు. బీటా కెరొటిన్‌తో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ఐరన్‌, ఫోలేట్‌ కూడా గుమ్మడిలో ఎక్కువేనని అంటున్నారు. ఇంకెెందుకు ఆలస్యం గుమ్మడికాయ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందామా..

కంటికి వెలుగు:క్యారెట్లు, చిలగడ దుంపల్లో మాదిరిగానే గుమ్మడికాయలోనూ బీటా కెరొటిన్‌ దండిగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసే ఇది ఒంట్లోకి చేరుకున్నాక విటమిన్‌ ఎ రూపంలోకి మారిపోతుంది. అరకప్పు గుమ్మడి ముక్కలతోనే మనకు రోజుకు అవసరమైన విటమిన్‌ ఎ లభిస్తుంది! కళ్లు బాగా కనబడటానికి, పునరుత్పత్తి అవయవాలు సజావుగా పనిచేయటానికి విటమిన్‌ ఎ చాలా అవసరమనే సంగతి తెలిసిందే. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి కీలక అవయవాల ఆరోగ్యానికీ ఇది దోహదం చేస్తుంది. కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పు తగ్గటానికీ విటమిన్‌ ఎ తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

రోగనిరోధకశక్తి బలోపేతం: బీటా కెరొటిన్‌తో పాటు విటమిన్‌ సి, విటమిన్‌ ఇ, ఐరన్‌, ఫోలేట్‌ కూడా గుమ్మడిలో ఎక్కువే. ఇవన్నీ రోగనిరోధకశక్తిని బలోపేతం చేసేవే కావటం గమనార్హం. అందువల్ల ఇది ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడటమే కాదు.. వాటి నుంచి త్వరగా బయటపడటానికీ తోడ్పడుతుంది.
హైబీపీ తగ్గుముఖం:రింజ రంగులో నిగనిగలాడే గుమ్మడి ముక్కల్లోని పొటాషియం రక్తపోటు తగ్గటంలోనూ సాయపడుతుంది. ఫలితంగా పక్షవాతం ముప్పూ తగ్గుముఖం పడుతుంది. అంతేనా? ఎముక సాంద్రత కూడా మెరుగవుతుంది. గుమ్మడి గింజలు కూడా తక్కువేమీ కాదు. వీటిల్లోనూ బోలెడన్ని ఖనిజాలుంటాయి. కొలెస్ట్రాల్‌ మాదిరి వృక్ష స్టెనాల్స్‌ కూడా ఎక్కువే. ఇవి మంచి కొవ్వు స్థాయులు పెరిగేలా చేస్తాయి.

బరువు అదుపు:గుమ్మడిలో పీచు ఎక్కువ. కేలరీలు తక్కువ. ఇలా ఇది త్వరగా ఆకలి వేయకుండా, బరువు పెరగకుండా చూస్తుంది. పీచుతో మలబద్ధకం కూడా దూరమవుతుంది.
మంచి నిద్ర:గుమ్మడి గింజల్లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరటోనిన్‌ అనే రసాయనం ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది. సెరటోనిన్‌ హాయి భావనను కలిగించటంలోనే కాదు.. నిద్ర కూడా బాగా పట్టేలా చేస్తుంది

ఇదీ చదవండి:గైనకాలజిస్ట్ వద్ద ఆ విషయాలు దాచొద్దు..

ABOUT THE AUTHOR

...view details