తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పంటి నొప్పితో బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే ఇన్​ఫెక్షన్​కు చెక్! - దంత సమస్యకు చిట్కాలు

నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా సరే.. కొన్నిసార్లు వివిధ దంత సంబంధిత సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో పంటి సమస్యలను చెక్ పెట్టేందుకు నిపుణులు చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

toothache problem solution
toothache problem solution

By

Published : Apr 2, 2023, 3:16 PM IST

నోటి ఆరోగ్యం మీద మనం అంతగా దృష్టి పెట్టం. పంటి నొప్పి వంటివి తలెత్తితే గానీ దీని ప్రాధాన్యమేంటో అర్థం కాదు. ఉదయం నిద్ర లేచాక పళ్లు తోముకోవటంతోనే చాలామంది సరిపుచ్చుతుంటారు. ఆహార అలవాట్ల పరంగానూ జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత కాలంలో చాలా మంది పంటి నొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వల్ల చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. నచ్చింది తినలేక.. అలాగే ప్రశాంతంగా ఉండలేక బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంటి సమస్యలకు చెక్​ పెట్టేందుకు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

మానవ శరీరంలో అత్యంత ధృడమైనవి దంతాలు. దంతాల్లో ఎనామిల్ పొర, డెంటిన్ పొర, మొత్తని కణజాలం ఉంటుంది. దంతక్షయం, బ్యాక్టీరియల్ ఇన్​ఫెక్షన్ వల్ల అప్పుడప్పుడు పంటి నొప్పులు వస్తాయి. దంతాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల ఇన్​ఫెక్షన్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పన్ను విరిగిపోయినప్పుడు పంటిలో నొప్పి వస్తుంది. అలాగే పుప్పి పన్ను వల్ల కూడా బాగా నొప్పి పెడుతుంది. పళ్లకు రూట్ కెనాల్ చేయడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు అంటున్నారు.

"బాక్టీరియా, దంతాల వాపు వల్ల పంటి నొప్పి వస్తుంది. పంటి నొప్పి దంతాలు దెబ్బతినడానికి సంకేతం. దంతాల చుట్టూ ఇన్​ఫెక్షన్​ వల్ల పంటి నొప్పి వస్తుంది. కొన్ని రకాల పంటి సమస్యలకు రూట్ కెనాల్ ద్వారా చెక్ పెట్టవచ్చు. పళ్లు పుచ్చిపోవడానికి ఎక్కువ కారణం అధిక తీపి ఉన్న పదార్థాలు తీసుకోవడమే. తీపి పదార్థాలు వల్ల నోటిలో బాక్టీరియా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే రోజుకు రెండుసార్లు బ్రష్​ చేయాలి. అలాగే క్రమం తప్పకుండా మౌత్​ వాష్​తో నోటిని శుభ్రం చేసుకోవాలి. భోజనం చేశాక నోటిలో నీళ్లు వేసుకుని పుక్కిలించాలి."
-గోపీనాథ్ అన్నే, డెంటిస్ట్

పంటి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • క్రమం తప్పకుండా బ్రష్ చేయడం
  • బ్రష్ కింది నుంచి పైకి.. పై నుంచి కిందికి చేయాలి
  • మౌత్ ఫ్రెషనర్​తో నోటిని శుభ్రం చేసుకోవాలి
  • పుప్పి పళ్లు, పంటి సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్​ను సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయకూడదు.
  • నాలుకపై ఉన్న పాచిని శుభ్రం చేసుకోవాలి.
  • డెంటిస్ట్ దగ్గర ఏడాదికి రెండు సార్లు దంతాలను శుభ్రం చేయించుకోవాలి.
  • రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి
  • భోజనం చేశాక నీళ్లను నోటిలో వేసి పుక్కిలించాలి
  • తీపి పదార్థాలకు దూరంగా ఉండడం మేలు
పంటినొప్పితో బాధపడుతున్నారా?.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే!

ABOUT THE AUTHOR

...view details