తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కండరాలు బలంగా ఉండాలంటే ఇవి తినండి!

శరీరానికి ప్రోటీన్లు చాలా అవసరం. కండరాలు బలంగా ఉండటానికి.. రోజంతా చురుకుగా ఉండటానికి ప్రోటీన్లు ఎంతో తోడ్పడతాయి. అలా చూసుకుంటే టోఫూ, కీన్వాల్లో ప్రోటీన్ల ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలీదు. అలాంటివారి కోసమే ఈ 'టోఫూ బౌల్'​.

tofu bowl recipe
టోఫూ బౌల్​ రెసిపీ

By

Published : Aug 31, 2021, 4:00 PM IST

రోజంతా పని చేయాలంటే.. కండరాలు బలంగా ఉండాలి. అలా ఉండటానికి క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలి. అయితే కొన్నిసార్లు పనిలోపడి ఆహారాన్ని తీసుకోవడంలో లేదా తయారు చేయడంలో కొందరు అశ్రద్ధ చేస్తారు. అలాంటి వారి కోసమే ఈ టోఫూ బౌల్​. ఎక్కువ ప్రోటీన్లు అందించే టోఫూ బౌల్​ త్వరగా ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావాల్సినవి..

టోఫూ పన్నీర్​ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు, స్వీట్​ చిల్లీసాస్ 2​ టీస్పూన్​లు, నూనె 1 టీస్పూన్​, కీరాముక్కలు 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, కిస్​మిస్​ 1 కప్పు, ఉడికించిన కీన్వా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా..

తయారీ విధానం

ముందుగా పాన్​ పెట్టి నూనె వేసి అందులో జీడిపప్పు, కిస్​మిస్​, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని తర్వాత టోఫూ ముక్కలు, తగినంత ఉప్పు, స్వీట్​ చిల్లీ సాస్ వేసి బాగా కలిపి బాగా కలపాలి. కాసేపు తర్వాత కీర ముక్కలు, ఉడికించిన కీన్వా వేసి బాగా కలుపుకొని.. కొంచెం నీళ్లు వేసి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత సర్వింగ్​ బౌల్​లోకి తీసుకుని కొత్తిమీర వేసి గార్నిష్​​ చేసుకుంటే టోఫూ బౌల్​ రెడీ.

ఇదీ చూడండి:కూరగాయల్లో కల్తీ జరిగిందా?.. తెలుసుకోండి ఇలా!

ABOUT THE AUTHOR

...view details