తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 12:02 PM IST

ETV Bharat / sukhibhava

ఆఫీస్ స్ట్రెస్‌ నుంచి రిలాక్స్‌ పొందాలా? సాయంత్రం ఈ పనులు చేయండి!

Tips to Reduce Stress: ఆఫీస్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెస్ట్‌ లేకుండా పనిచేసి.. సాయంత్రానికి డియాక్టివేట్‌ అయిపోతున్నారా..? ఏ పని చేయాలన్నా ఓపిక ఉండటం లేదా? ఇక నో వర్రీ.. ఈ టిప్స్​ పాటిస్తే.. సాయంత్రం మళ్లీ రియాక్టివేట్‌ అయిపోవచ్చుంటున్నారు నిపుణులు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Tips to Reduce Stress
Tips to Reduce Stress

Tips to Reduce Stress After Work : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పొదుపు చేసేందుకు కొందరైతే, తమ కాళ్ల మీద తాము నిలబడాలని కోరికతో మరికొందరు జాబ్స్​ చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీస్‌లో నిరంతరాయంగా పనిచేసి.. సాయంత్రం ఇంటికి వచ్చే సరికి శరీరంలో ఎవరో స్ట్రా వేసుకుని తాగినట్లు సత్తువ అంతా పోతుంది. ఆఫీస్‌కు వెళ్లే చాలా మంది.. తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి ఒత్తిడి సబంధిత లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ ఒత్తిడి వల్ల కలిగే.. ప్రతికూల ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు కూడా. ఒత్తిడి కారణంగా.. నిద్రలేమి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఆఫీస్‌ స్ట్రెస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మరి మీరు కూడా ఆఫీసుకు పోయి వచ్చిన తర్వాత స్ట్రెస్​గా ఫీల్​ అవుతున్నారా..? అయితే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి తగ్గి రిలాక్స్​గా ఉంటారంటున్నారు నిపుణులు.. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

నిద్రలో కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా? అయితే మీకు ఈ లోపమున్నట్లే!

సరైన ఆహారం:ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చాలా మంది పిజ్జా, బర్గర్‌ అంటూ జంక్‌ ఫుడ్‌ తింటారు. ఇంకొందరు.. కాఫీ, టీ తాగితే మైండ్​ రిలాక్స్​ అవుతుందని వాటిని తీసుకుంటారు. అయితే ఇవి తాగితే.. అప్పటికప్పుడు రిలాక్స్‌గా అనిపించినా వీటి కారణంగా ఉబ్బరం, నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. అందుకోసం.. మీ డైట్‌లో సమతుల్య ఆహారం తీసుకోవాలి. సాయంత్రం పండ్లు, నట్స్‌, తాజా కూరగాయలు తీసుకోవాలి. వీటిలోని విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లు.. శరీరానికి స్థిరమైన శక్తిని అందించి.. ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.

మ్యూజిక్​: మ్యూజిక్​.. ఈపేరులోనే ఓ మ్యాజిక్​ ఉంది. బాధ.. సంతోషం.. ఇలా ఏదైనా మ్యూజిక్​ ఇచ్చే రిలీఫ్​ మరేది ఇవ్వలేదు. అందుకే ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఒత్తిడిని తగ్గించేందుకు సంగీతం వినాలంటున్నారు నిపుణులు. మీకు నచ్చిన సంగీతం వినడం వల్ల నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎదుర్కొన్న స్ట్రెస్ దూరం అవుతుంది.

చలికాలంలో కీళ్లనొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆసనాలతో రిలీఫ్​!

గోరువెచ్చని నీళ్లతో స్నానం:చాలా మంది ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అలానే కుర్చీల్లో కూర్చుంటారు. ఎప్పుడో పడుకునేముందు స్నానం చేస్తారు. అయితే.. అలా కాకుండా పని తర్వాత.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, శరీరం రిలాక్స్‌ అవ్వడానికి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయమని నిపుణులు చెబుతున్నారు. వేడి నీళ్లు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే కండరాలను సడలించడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు విశ్రాంతిని ఇవ్వడానికి సహాయపడుతుంది.

మెడిటేషన్​: ప్రాణాయామం, ధ్యానం వంటివి.. ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా సాయపడతాయి. ధ్యానం మీ మెదడును రీసెట్‌ చేయడానికి సహాయపడుతుంది. ఒత్తిడి నుంచి రిలాక్స్​ పొందడానికి.. మైండ్-క్లియరింగ్ లేదా ఎమోషన్-ఫోకస్డ్ మెడిటేషన్ వంటి వివిధ పద్ధతులతో ప్రయోగాలు చేయడం మంచిది.

కాపర్ బాటిల్స్​లో వాటర్ తాగుతున్నారా? - అయితే మీ లివర్​ డేంజర్​ జోన్​లో పడ్డట్లే!

ఫీలింగ్స్​ను బుక్​లో రాసుకోవడం:ఒత్తిడిని ఉపశమనం పోవాలంటే.. మీ ఫీలింగ్స్​ను ఓ పుస్తకంలో రాయలంటున్నారు నిపుణులు. ఇది మీ భావాలను బయటపెట్టడానికి, ప్రాసెస్‌ చేయడానికి సహాయపడుతుంది. మీ గోల్స్​, ఫీలింగ్స్​ రాయడం వల్ల... సమస్యలను మరింత విజయవంతంగా పరిష్కరించవచ్చు.

నిద్ర లేవగానే నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

నీరసం తగ్గి రోజంతా యాక్టివ్​గా ఉండాలా? - అయితే ఈ ఫ్రూట్స్ తినాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details