తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నాట్యం చేద్దాం.. బరువు తగ్గుదాం! - beauty and health

బరువు నియంత్రణలో ఉండాలంటే సమతుల ఆహారంతోపాటూ వ్యాయామం కూడా తప్పనిసరి. వీటితో మరి కొన్ని ప్రభావమంతమైన, ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించడం వల్ల బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా!

Tips to lose weight in telugu
నాట్యం చేద్దాం.. బరువు తగ్గుదాం!

By

Published : Aug 11, 2020, 10:31 AM IST

నిద్ర:

తగినంత నిద్ర ఆకలిని పెంచే హార్మోనును నియంత్రిస్తుంది. కాబట్టి రోజులో ఏడెనిమిది గంటలు ఎలాంటి అంతరాయం లేకుండా హాయిగా నిద్రపోండి. ఫలితంగా బరువు తేలిగ్గా తగ్గొచ్ఛు

నవ్వు:

నవ్వడం వల్ల శరీరంలో సంతోషాన్ని కలిగించే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. దాంతో అతిగా తినడం నియంత్రణలోకి వస్తుంది.

చిన్న కంచం:

పోషకాలు నిండుగా ఉన్న ఆహారాన్ని చిన్న ప్లేట్‌లో తినడం మంచిది. పెద్ద కంచంలో తింటున్నప్పుడు ఎంత తింటున్నాం అనేది అంచనా లేకుండా తింటాం. దాంతో బరువు పెరుగుతాం.

చిన్నపాటి నడక:

అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, స్ట్రోక్స్‌ వచ్చే ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది. ఇన్ని లాభాలున్న నడకను మీ దినచర్యలో భాగం చేసుకోండి. ప్రతిరోజూ కొద్ది సమయాన్ని నడకకు కేటాయించండి.

ధ్యానం:

ఇది మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ధ్యానం ఎండోక్రైన్‌ పనితీరును నియంత్రిస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గిపోయి సంతోషంగా ఉండగలుగుతారు.

నృత్యం:

మీకు వచ్చిన భంగిమలను సాధన చేసినా సరిపోతుంది. డాన్స్‌ ఆరోగ్యకరమైన హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. బరువు తగ్గడం తేలిక అవుతుంది.

ఇదీ చదవండి:పదవుల కోసం వెంపర్లాడటం లేదు: పైలట్​

ABOUT THE AUTHOR

...view details