Tips to Build Strong Relationship With Mother in Law: పెళ్లి తర్వాత అమ్మాయి జీవితంలోకి అనేక కొత్త బంధాలు వచ్చేస్తాయి. ఇందులో ఏ బంధం సంగతి ఎలా ఉన్నా.. అత్తాకోడళ్ల బంధం మాత్రం స్పెషల్ కేటగిరీలోకి వస్తుంది. వందకు తొంభై శాతం ఇళ్లలో అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతాయంటే.. ఆ రిలేషన్ ఎంత పెళుసైనదో అర్థం చేసుకోవచ్చు. కోడలు తన కొడుకును ఎక్కడ కొంగున కట్టేసుకుంటుందోననే భావనతో అత్తగారు.. తనపై డామినేషన్ చేయడమేంటనే ఆలోచనతో కోడలు.. ప్రత్యర్థుల్లా మారిపోతారు. ఇలా వీళ్లిద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. ఈ పరిస్థితి ఎంతగా ముదిరితే.. విభేదాలు అంతగా బలపడతాయి. అయితే.. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా.. అత్తాకోడళ్లు తల్లీకూతుళ్లలా మెలగొచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి.. అవేంటో తెలుసుకుందాం.
రోజులో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొంటే గర్భం వస్తుంది? - రీసెర్చ్‌లో ఆసక్తికర విషయం!
కూతురి కంటే ఎక్కువగా..: అప్పటిదాకా పుట్టింట్లో గారాబంగా పెరిగిన అమ్మాయి మెట్టినింట్లో అడుగుపెట్టే క్రమంలో ఒక రకమైన భయాందోళనలకు లోనవడం సహజం. అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో.. అత్తింటి వాళ్లు ఎలా మెలగుతారో, వాళ్ల ఇష్టాయిష్టాలేంటో, ఆ ఇంట్లో నేను ఇమడగలనో లేదో.. ఇలా ఎన్నో సందేహాలు కొత్త కోడలి మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇలాంటి సమయంలోనే అత్తగారు ఓ అమ్మలా తన కోడలికి భరోసా ఇవ్వాలని నిపుణులు అంటున్నారు. "ఇది కూడా నీ పుట్టిల్లు లాంటిదే.. ఇక నుంచి నేనే నీకు అమ్మను.. ఇక్కడ నీకు నచ్చినట్లు ఉండచ్చు.." అంటూ ఆమెలో ఉన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. ఇలాంటి మాటలు కోడలికి కలుపుగోలుతనాన్ని అలవాటు చేస్తాయి. అదే సమయంలో కోడలు కూడా తన అత్తను అమ్మగా భావించాలి. పొరపాటున ఏదైనా మాట అంటే స్వీకరించాలి. ఒకరి కష్టసుఖాలు ఒకరు, ఒకరి పనులు ఒకరు పంచుకుంటూ ముందుకు సాగాలి.
కలిసి వంట చేయడం:అత్తాకోడళ్ల మధ్య సఖ్యత కుదరాలంటే కలిసి వంట చేయడం బెస్ట్ ఆప్షన్. వంట మనసులో ఉన్న స్ట్రెస్‌ను తగ్గించడమే కాదు.. బంధాలను బలపరుస్తుంది కూడా. అందుకే.. ఇద్దరూ కలిసి వంట చేయండి. ఈ సమయంలో ఫుడ్‌కు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పంచుకుంటారు కూడా. ఇలాంటి జ్ఞాపకాలతో.. మీ ఇద్దరి మధ్య ముచ్చటించుకోవడం పెరుగుతుంది. అత్తగారి దగ్గర కోడలు కొత్త వంటకాలు నేర్చుకోవచ్చు. కోడలికి తెలిసినవి అత్తకు నేర్పొచ్చు.
ఎక్కువ మంది భార్యాభర్తలు విడిపోతున్నది.. ఈ 7 కారణాలతోనే!
షాపింగ్ చేయండి:ఆడవాళ్లకు షాపింగ్ అంటే ప్రాణం అని చెప్పొచ్చు. అందుకే.. అత్తాకోడళ్లు ఇద్దరూ కలిసి షాపింగ్ చేయండి. మీ ఇద్దరికీ ఒకరి టేస్ట్ మరొకరి అర్థం అవుతుంది. ఒకరి కోసమ మరొకరు సెలక్షన్ చేయండి. అయితే.. ఆ సెలక్షన్ మీకు నచ్చకపోతే.. దానికి కారణం ఏంటో అర్థమయ్యేలా చెప్పండి. అదే సమయంలో వాళ్లకు నచ్చలేదు అన్నప్పుడు.. వారి అభిప్రాయాన్ని గౌరవించండి.