తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయా? ఈ సూచనలు పాటిస్తే బంధం స్ట్రాంగ్ అవుతుంది!

Relationship Tips Between Wife and Husband : నేటి ఆధునిక కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య పెరుగుతోంది! మరి.. ఈ పరిస్థితికి కారణం ఏంటి? భార్యాభర్తలిద్దరూ ఆనందంగా ఉండాలంటే.. ఆ బంధం శాశ్వతం కావాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలకు సైకాలజిస్టులు పలు సమాధానాలు ఇస్తున్నారు.

Relationship Tips
Relationship Tips

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 10:31 AM IST

Tips to Build Strong Relationship Tips Between Wife and Husband:పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు. కానీ.. ఈ మధ్య చాలా జంటల వివాహ బంధం మూణ్నాళ్ల ముచ్చటే అవుతోంది. చిన్నవిగా కనిపించే విషయాలే.. పెనుతుఫానుగా మారుతున్నాయి. ఇద్దరి మధ్యా చీలిక తెస్తున్నాయి. మరి.. ఎందుకు పరిస్థితులు ఇంతలా దిగజారుతున్నాయి? విడిపోతున్న జంటల సంఖ్య ఎందుకు పెరుగుతోంది? భార్యాభర్తలిద్దరూ ఆనందంగా ముందుకు సాగాలంటే ఏం చేయాలి? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం..

అత్తాకోడళ్లు తల్లీకూతుళ్లలా మెలగాలా? ఇలా చేస్తే నిత్య సంక్రాంతే!

నిజాయితీగా ఉండాలి:మీరు మీ భాగస్వామితో నిజాయితీగా ఉండాలి. మీరు హానెస్ట్​గా ఉంటూ.. మీ భాగస్వామి నుంచి అది ఆశించాలి. ఇలా.. భార్యాభర్తలిద్దరూ నిజాయితీగా ఉన్నప్పుడే, ఆ రిలేషన్‌షిప్ ఆనందంగా కొనసాగుతుంది. దాపరికాలకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకండి. నిజాయితీ కోల్పోతే మాత్రం.. ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి వస్తుంది. ఇదే జరిగితే బంధానికి బీటలు వారుతాయి.

సమయం కేటాయించుకోండి:కుటుంబ బాధ్యతలు ఎన్ని ఉన్నా.. భార్యాభర్తలు ఇద్దరూకాస్త సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో ఆనందంగా గడపండి. నిజాయితీగా మనసు విప్పి మాట్లాడుకోండి. ఆ సమయంలో కేవలం ఇద్దరి గురించి తప్ప మిగిలిన ఏ విషయాలను మీ మధ్యలోకి రానివ్వకండి. ఇలా చేయడం వల్ల మీ రిలేషన్ షిప్ ఆనందంగా ఉంటుంది.

జాగ్రత్తగా గమనించండి:ఒకరు చెప్పేది మరొకరు శ్రద్ధగా వినాలనే షరతు భార్యాభర్తలిద్దరికీ వర్తిస్తుంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు వారు చెప్పేది జాగ్రత్తగా వినండి. అతని కళ్లలోకి చూసి మాట్లాడండి. కళ్లలో కళ్లు పెట్టి చూసినప్పుడు ఐ కాంటాక్ట్ ప్రభావం చూపుతుంది. దీంతో ఇద్దరి మాటలకు విలువ పెరుగుతుంది.

మహిళలు సెక్స్ విషయంలో ఆసక్తి లేనప్పుడు ఏం చేస్తారో తెలుసా?

సూటిగా, స్పష్టంగా చెప్పాలి:మీరు ఏమి చెప్పబోతున్నారో సూటిగా, స్పష్టంగా, త్వరగా చెప్పండి. మీ ఆలోచనలను క్లియర్‌గా మీ భాగస్వామికి అర్థమయ్యేటట్లు చెప్పండి. మ్యాటర్ సాగదియ్యవద్దు. సాగదీస్తే గందరగోళం ఏర్పడుతుంది. అంతగా అనవసరం అనుకునే విషయాలపై చర్చలు వద్దు. మీ భర్త మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీరు కూడా మెచ్చుకోండి. అప్పుడు మీ మధ్య ప్రేమ పెరుగుతుంది.

సెక్స్‌ తర్వాత అలాగే పడుకుంటున్నారా? కచ్చితంగా చేయాల్సినవి ఇవే!

ఒకరికోసం ఒకరుగా :అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. అదే.. ఒకరికోసం మరొకరు బతకడం. ఒక బంధం బలంగా ఉండాలంటే.. "నేను" అనేదానికి అవకాశం ఉండకూడదు. "మనం" అనే భావన ఎంత బలంగా ఉంటే.. మీ దాంపత్య బంధం అంత స్ట్రాంగ్ అవుతుంది. మీ భాగస్వామి కోసం మీరు చేసే ప్రతి పనీ.. వారిపై మీకున్న ప్రేమను తెలియజేస్తుంది. కాబట్టి.. వారి ఇష్టాలకు మీరు ప్రాధాన్యం ఇవ్వండి. అదికూడా ఇష్టంగా చేయండి. అప్పుడు కచ్చితంగా మీ ప్రేమ మీ భాగస్వామికి అర్థమవుతుంది.

మహిళల్లో అధిక బరువా? కారణం తిండి కాకపోవచ్చు!

గుడ్డు పెంకులతో సౌందర్యం - అలా చేస్తే ముఖంలో కొత్త మెరుపు!

ABOUT THE AUTHOR

...view details