జీవితంలో ప్రతి విషయాన్ని పూర్తిగా ఆస్వాదించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా పెళ్లి విషయంలో వాళ్లు చాలా జాగ్రత్తలు చెబుతుంటారు. పెళ్లి తర్వాత ఎంతో ముఖ్యమైన శోభనం రాత్రి గురించి ఎన్నో చిట్కాలు కూడా చెబుతుంటారు. అయితే చాలామంది మగవాళ్లకు శోభనం రోజు రాత్రి తమ భాగస్వామితో ఎలా శృంగారం చేయాలో, ఎంత సేపు చేయాలనే కలలు కంటుంటారు. కానీ బెడ్రూంకి వెళ్లిన తర్వాత మాత్రం ఒత్తిడి, ఆందోళన వల్ల.. వారు అనుకున్న స్థాయిలో ఆనందాన్ని, తృప్తిని పొందలేకపోవచ్చు. అదే సమయంలో ఆడవారిలో కూడా కొన్ని ఇబ్బందులు, భయాల వల్ల సంతృప్తి కలగకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మొదటిరోజు రాత్రి మగవాళ్లు ఆనందించడానికి, ఆడవారిని సంతృప్తి పరచడానికి డా.జి.సమరం కొన్ని సలహాలు ఇచ్చారు. అవేంటో తెలుసుకుందాం.
చాలా మంది మగవారిలో మొదటిరోజు రాత్రి అదరగొట్టాలని, భాగస్వామిని పూర్తిస్థాయిలో సంతృప్తి పరచాలనే కోరికలను కలిగి ఉంటారు. కానీ తమ భాగస్వామిని సంతృప్తి పరచాలనే కోరిక కాస్త ఒత్తిడిగా మారితే ఇబ్బంది కలుగుతుందని డా.సమరం వివరించారు. మొదటి రాత్రి ఎలా గడుస్తుందో అనే ఒత్తిడి, ఆందోళన, కంగారుతో పాటు తమ భాగస్వామిని మెప్పించలేకపోతే ఏమవుతుందేమో అనే భయం కూడా మంచిది కాదు అని సలహా ఇస్తున్నారు.
ఇలాంటి పరిస్థితులను నివారించడానికి మగవాళ్లు తమలో తాము ఆత్మధైర్యం తెచ్చుకోవాలని డా.సమరం సలహా ఇస్తున్నారు. శోభనం రాత్రి అదరగొట్టేస్తాను అని తమను తాము ఉత్తేజపరుచుకోవడం ద్వారా మగవారు ఈ ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అని ఆయన చెబుతున్నారు. మగవాళ్లు ఎక్కువ ఒత్తిడికి గురైతే శరీరంలో రసాయనిక చర్యలు జరిగి, శృంగారం అనుకున్న స్థాయిలో చేయలేరని.. అందుకే దానిని తగ్గించుకోవాలని అంటున్నారు.