తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీ జుట్టు రాలిపోతుందా..? అయితే ఇలా చేస్తే సరిపోతుంది..! - Hibiscus

ఆకర్షణీయమైన ఎర్రటి రంగులో అందమైన ఆకృతిలో విచ్చుకునే మందారం...ఎవరినైనా ఆకట్టుకుంటుంది. దీని ఆకులు, పూలు చర్మం, జుట్టుకి తగిన పోషణ అందిస్తాయి. అదెలా అంటే...!

tips-for-to-grow-hair-in-telugu
జుట్టు రాలిపోతుందా? ఇలా చేస్తే.. ఊడిన జుట్టు తిరిగి వస్తుంది!

By

Published : Jun 27, 2020, 11:21 AM IST

జుట్టు రాలిపోతుందా? మందార పూలను ఎండబెట్టి పొడి చేయండి. కొబ్బరినూనె మూడువంతులు, పావు వంతు ఆముదం, కొద్దిగా మెంతులు తీసుకుని దానిలో ఈ పొడి కలపండి. దీన్ని బాగా మరగనిచ్చి సగం అయ్యేలా చూడండి. ఈ నూనెను రోజూ తలకు రాసుకుంటే సరి. ఊడిన జుట్టు తిరిగి వస్తుంది. పొడిబారిన వెంట్రుకలు మెత్తగా అవుతాయి.

  • మందారపూలను నీళ్లల్లో వేసి మరిగించాలి. ఈ నీటికి రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ కలిపి తలారా స్నానం చేస్తేసరి. వీటిల్లోని సుగుణాలు చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. ఒళ్లు నొప్పులు వంటివి అదుపులోకి వస్తాయి.
  • రసాయనాల షాంపూలు, స్టైలింగ్‌ పరికరాలు తరచూ వాడటం, కాలుష్యం వంటివి జుట్టుని నిర్జీవంగా మార్చేస్తాయి. ఇలాంటప్పుడు గుప్పెడు చొప్పున మందారపూలు, ఆకులు తీసుకుని మెత్తగా నూరుకోవాలి. దీనికిరెండు చెంచాల కలబంద రసం, చెంచా ఆలివ్‌ నూనె కలిపి తలకు ప్యాక్‌లా వేయాలి. దీన్ని ఓ గంట పాటు ఉంచుకుని తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా కనీసం పదిహేను రోజులకోసారి చేస్తుంటే జుట్టుకి తగిన పోషణ అంది ఆరోగ్యంగా మారుతుంది.

ABOUT THE AUTHOR

...view details