తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తప్పకుండా తినండి! - Tips for keeping bones strong

ఎముకలు దృఢంగా ఉంటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్ఛు ఇవి బలంగా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే.. ఓసారి ఈ కథనం చదివి తెలుసుకోండి.

tips-for-keeping-bones-strong
మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే.. ఇవి తినండి!

By

Published : Jun 27, 2020, 10:49 AM IST

  • ఆకుకూరలు:

పాలకూర, బ్రకోలీలలోని పోషకాలు ఎముకల దృఢత్వానికే కాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి.

  • గుమ్మడి గింజలు:

వీటిల్లో పుష్కలంగా ఉండే మెగ్నీషియం ఎముకల నిర్మాణానికి తోడ్పడుతుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎముకల బలోపేతం అవడమే కాకుండా ఆస్థియోపోరోసిస్‌ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఈ గింజల్లో ఉండే మంచి కొవ్వులు అరికాలి మంటలను తగ్గించి ఎముకలను దృఢంగా మారుస్తాయి. రోజుకు ఎనిమిది నుంచి పదమూడు గింజలు వరకూ తినొచ్చు.

  • సోయాబీన్స్‌:

వీటిల్లో అధికంగా ఉండే ప్రొటీన్లు, క్యాల్షియం ఎముకలను బలోపేతం చేస్తాయి. మెనోపాజ్‌ దశలోని మహిళల్లో ఎముకలు బలహీనంగా మారతాయి. వీరు సోయా ఉత్పత్తులను తగిన మోతాదులో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

  • చేపలు:

వీటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతోపాటు క్యాల్షియం, విటమిన్‌-డి, విటమిన్‌-బి2 అధికంగా ఉంటాయి. వీటితోపాటూ ఎముకల నిర్మాణానికి అవసరమైన ఫాస్ఫరస్‌, జింక్‌ లాంటి ఖనిజాలూ నిండుగా ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details