- 20-20-20 సూత్రాన్ని తప్పనిసరిగా పాటించండి. ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. లేదా గంటకు అయిదు నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతినివ్వండి.
- విశ్రాంతి తీసుకొనే సమయంలో కళ్లను సవ్య, అపసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పాలి. లేదంటే కళ్లను మూసి ఉంచాలి.
- చాలామంది కనురెప్ప వేయకుండా కళ్లు పెద్దవి చేసి మరీ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు. ఇలా చేస్తే కళ్లు పొడిబారి, మంట పెడతాయి. అందుకే తరచుగా రెప్పలు వాల్చుతూ ఉండాలి. ఒకవేళ కళ్లు తరచూ పొడిబారుతూ ఉంటే వెంటనే నేత్రవైద్య నిపుణులను సంప్రదించి ఐడ్రాప్స్ తీసుకోవడం మంచిది.
- కళ్లు, మానిటర్ పైభాగం ఒకే ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మానిటర్ మధ్య భాగానికి, కళ్లకు 15 నుంచి 20 డిగ్రీల కోణం ఉంటుంది. ఫలితంగా కళ్లు ఎటువంటి ఒత్తిడికి గురవ్వవు.
- కళ్లకు, కంప్యూటర్ స్క్రీన్కు మధ్య కనీసం 22 నుంచి 28 అంగుళాల దూరం ఉండాలి.
- దుమ్ము, ధూళి లేకుండా స్క్రీన్‌ను తరచూ శుభ్రం చేసుకోవాలి.
- మానిటర్ పై వెలుగు పడకుండా ఉండాలి. అలా కుదరని పక్షంలో కిటికీలు, తలుపుల నుంచి స్క్రీన్‌పై నేరుగా వెలుతురు పడకుండా కర్టెన్లు ఉపయోగించాలి.
- అలాగే స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మన కంటికి సరిపోయే రీతిలో అమర్చుకోవాలి.
- కళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేయడానికి వీలుగా లభించే యాంటీ రిఫ్లెక్టివ్ కళ్లద్దాలను ఉపయోగించవచ్చు. ఈ విషయంలో వైద్యుని సలహా తప్పనిసరి.
- గదిలో ప్రసరిస్తున్న వెలుగుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కలర్ సెట్టింగులను మార్చే సాఫ్ట్వేర్లను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. వీటి వల్ల గది వెలుతురుకు అనుగుణంగా స్క్రీన్ బ్రైట్నెస్, కాంట్రాస్ట్ మారుతూ ఉంటాయి.
- సాధ్యమైనంత వరకు ఫాంట్సైజు పెంచుకోవాలి.
- ముఖానికి ఎదురుగా ఫ్యాన్ పెట్టుకోవద్దు. గాలి వల్ల కూడా కళ్లు తొందరగా పొడిబారిపోయే అవకాశం ఉంటుంది.
- కంప్యూటర్ పై ఎక్కువ సమయం పనిచేసేవారు కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించకపోవడం ఉత్తమం. ఎందుకంటే వాటివల్ల కూడా కళ్లు పొడిబారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
చూశారుగా! కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు కళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీరు కూడా వీటిని తప్పకుండా పాటించండి. మీ కళ్లను జాగ్రత్తగా సంరక్షించుకోండి. అలాగే నిర్ణీత వ్యవధుల్లో క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.