తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పెళ్లి కూతురు మేకప్ - ఈ పనులు చేస్తే అంతే!

Tips For Bride Glowing Skin : పెళ్లిలో మెరుపంతా అమ్మాయి ముఖంలోనే ఉంటుంది. అందుకే.. పెళ్లికి ముందు నేచురల్ టిప్స్​తోపాటు పెళ్లిరోజున బ్రైడల్ మేకప్​ వరకూ ఎన్నో ప్రయోగాలు చేస్తారు. అయితే.. తెలియక చేసే పొరపాట్ల వల్ల బ్యూటీ ప్రయోగం వికటించే ప్రమాదం ఉంది. అందుకే.. కొన్ని పనులు అస్సలే చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Bridal Tips For Glowing Skin
Bridal Tips For Glowing Skin

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 3:40 PM IST

Tips For Bride Glowing Skin : ప్రతి అమ్మాయికీ పెళ్లిని మించిన అద్భుతమైన వేడుక ఏముంటుంది? అందుకే.. అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటారు. పెళ్లి వేడుకలో అందంగా మెరిసిపోవాలని ఆశపడతారు. ఇందుకోసం.. కొన్ని రోజుల ముందు నుంచే ముఖ సౌందర్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే.. ఈ క్రమంలో తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్లు.. ెళ్లి కూతురు అందాన్ని దెబ్బతీస్తాయంటున్నారు నిపుణులు. మరి.. వాటిని ఎలా నివారించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వధువులు అందంగా కనిపించడానికి చేయాల్సిన పనులు..

ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోండి..
పెళ్లి రోజు అందంగా కనిపించడానికి కొన్ని రోజుల ముందు నుంచే అమ్మాయిలు పార్లర్లకు వెళ్తుంటారు. ఈ పార్లర్లలో ఉపయోగించే ఫేషియల్‌ క్రీమ్‌ ఉత్పత్తులు కొంతమంది చర్మానికి పడకపోవచ్చు. అప్పుడు లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే.. మీరు చేయించుకోవాలనుకునే ఫేషియల్‌ ఏదో ముందు నిర్ణయించుకొని, దానికి సంబంధించిన ఉత్పత్తుల్ని ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మంచిది. ఆ తరువాతే ముందుకెళ్లడం మంచిది. ఈ శ్రమంతా ఎందుకు అనుకునే వారు, పండ్ల గుజ్జుతో ఇంట్లోనే సహజ సిద్ధంగా ఫేషియల్‌ చేసుకోవచ్చు.

జుట్టును సంరక్షించుకోండి..
పెళ్లిలో మాత్రమే కాకుండా.. మెహెందీ, హల్దీ.. వంటి ముందస్తు పెళ్లి వేడుకల్లో, రిసెప్షన్‌లో.. వివిధ రకాల హెయిర్‌స్టైల్స్‌తో ఈతరం వధువులు ఆకట్టుకుంటున్నారు. ఇలా వెంటవెంటనే వివిధ రకాల హెయిర్‌స్టైల్స్‌ని ప్రయత్నించడం వల్ల జుట్టు డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇలా జరగకుండా హెయిర్‌స్టైల్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. హెన్నా, ఇతర సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి తయారుచేసిన హెయిర్‌ప్యాక్‌లను వేసుకోవాలని, పెళ్లికి ముందు హెయిర్ స్పా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణుల సలహాలు తీసుకోవాలి..
మొటిమలు, మచ్చలు.. చాలామంది అమ్మాయిలకు నిద్ర లేకుండా చేస్తుంటాయి. ఇక వివాహ సమయం దగ్గరపడే కొద్దీ వాటిని దూరం చేసుకోవడానికి బయట దొరికే క్రీముల్ని వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల సమస్య తగ్గకపోగా.. కొత్త సమస్య తలెత్తే ప్రమాదమే ఎక్కువ ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి, ఇలాంటి సమయాల్లో సొంత వైద్యం కాకుండా నిపుణుల్ని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇంట్లో ఉండే బొప్పాయి, స్ట్రాబెర్రీ.. వంటి పండ్లతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్స్‌లను ఉపయోగించినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

చేతులు, పాదాలు కోమలంగా..
చర్మం, జుట్టు విషయంలో తీసుకున్న శ్రద్ధ చేతులు, పాదాల విషయంలో కొంత మంది వధువులు తీసుకోవడం లేదు. పెళ్లికి కొన్ని రోజుల ముందు నుంచే రాత్రి నిద్రపోయే వేళ చేతులను ఆలివ్ నూనెతో మర్దన చేసుకోవాలి. స్నానం చేసే సమయంలో ప్యూమిస్ స్టోన్‌తో పగుళ్లున్న పాదాలను రుద్దుకుంటే మంచిది. వీటితో పాటు మ్యానిక్యూర్, పెడిక్యూర్.. చేయించుకుంటే మేలు.

కళ్ల కింద డార్క్​ సర్కిల్స్​తో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే సెట్!

వధువుల చర్మం మెరిసిపోవడానికి రోజు ఎక్కువగా నీళ్లను తాగాలని నిపుణులు అంటున్నారు. ఎండ ఉన్నా లేకపోయినా బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం రంగు మారకుండా ఉంటుందని అంటున్నారు. ఎన్ని పనులు ఉన్నా సరే రోజు సరైన సమయంలో నిద్రపోవాలి. నిద్ర లేకపోతే నీరసంగా, డల్‌గా కనిపిస్తారని అంటున్నారు.

క్రాష్ డైటింగ్ వద్దు..
పెళ్లి కుదిరిన తర్వాత చాలామంది నాజూకైన శరీరాకృతి కోసం చాలా కష్టపడుతుంటారు. దీనికోసం క్రాష్ డైటింగ్ చేయడం లేదా ఎక్కువ సమయం జిమ్‌లో గడపడం చేస్తుంటారు. కొన్ని రోజుల గ్యాప్​తో ఇలా చేయడం వల్ల.. బక్కచిక్కినట్లుగా కనిపిస్తారు. ముఖంలో నీరసం కనిపిస్తుంది. అందుకే.. ఇలాంటి క్రాష్ డైటింగ్​ ప్రయత్నాలను విరమించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు నడక, పరుగు, జాగింగ్‌, ఈత.. వంటి తేలికపాటి వ్యాయామాలను చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

ఒత్తిడికి దూరంగా..
పెళ్లిరోజు దగ్గరపడే కొద్దీ కాస్త ఒత్తిడిగా అనిపించడం సహజం. అయితే.. ఇలాంటి మానసిక సమస్యలు కూడా అందంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి, మానసిక ప్రశాంతత కోసం రోజు పావుగంట ధ్యానం చేయడం మంచిదని చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో ఫీల్‌గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయని, దీంతో లోపలి నుంచి అందంగా కనిపిస్తారని అంటున్నారు.

వయసు 40 దాటిందా? - ఈ 7 టిప్స్​తో యంగ్​గా కనిపించండి!

మీ ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా లేకపోతే - ముఖ్యంగా పెళ్లైన వాళ్లకు - ఈ సమస్యలు గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details