Tips for better sleep: నిద్ర అనేది మనిషికి దేవుడు ఇచ్చిన వరం. కానీ నేడు చాలా మంది సరైన నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. నిద్రకు భంగం కలిగించేవాటిలో మొబైల్ ఫోన్ ఒకటి. ఇందులో ఉండే బ్లూలైట్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఈ బ్లూలైట్ వల్ల మన శరీరం మీద దుష్పరిణామాలు సంభవించే ఆస్కారం ఉంది. నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి టీవీలు, కంప్యూటర్లు, ఇతర బ్లూలైట్ ఉన్న పరికరాలను స్విచ్ ఆఫ్ చేయండి. రాత్రి పడుకోవడానికి అరగంట ముందే బ్లూలైట్లన్నీ ఆర్పేయాలి.
రాత్రిపూట గాఢ నిద్రపోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో 20నిమిషాలకు మించకుండా కునుకు తీస్తే.. రాత్రి పూట మెరుగ్గా నిద్రపోవచ్చు. రోజంతా ఫ్రెష్‌గా ఉండొచ్చు. మధ్యాహ్నం వేళ నీరసంగా అనిపిస్తే.. కొద్దిదూరం నడక, గ్లాసు చల్లటి నీళ్లు తాగడం, ఫోన్లో మాట్లాడటం మంచిది. నిద్ర వచ్చినా.. నిద్రపోకుండా ఉండటం మంచిది కాదు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయి. నిద్ర తగ్గితే బీపీ, షుగర్ పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, తలనొప్పి వంటివి వస్తాయి. ఐదు రోజులు వరుసగా నిద్ర పోకపోతే.. వెంటనే డయాబెటిస్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.