తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

నైట్​ డ్యూటీ చేసే వాళ్లు.. పగలు వయాగ్రా వేసుకోవచ్చా? - usage of varargs does away with the concept of

శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలని దంపతులు ఆశిస్తుంటారు. కానీ, వారిలో ఉండే కొన్ని సమస్యలు వారి సెక్స్​ జీవితానికి అడ్డంకిగా మారుతుంటాయి. వాటిని అధిగమించేందుకు వయాగ్రా వంటి మాత్రలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఉద్యోగరీత్యా నైట్​ డ్యూటీ చేసేవాళ్లు పగలు వయాగ్రా వేసుకొని శృంగారంలో పాల్గొనవచ్చా? అనే సందేహం కొందరిలో ఉంది. దానికి సమాధానం వైద్యనిపుణుల మాటల్లోనే..

Those who do night duty Can take Viagra during the day?
నైట్​ డ్యూటీ చేసే వాళ్లు.. పగలు వయాగ్ర వేసుకోవచ్చా?

By

Published : Sep 17, 2021, 7:00 AM IST

ప్రస్తుత కాలంలోని ఉరుకులపరుగుల జీవితంలో ప్రతిఒక్కరూ శృంగారానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అలా కొంతమంది ఉద్యోగాల్లో వివిధ షిఫ్టుల కారణంగా సెక్స్​ను ఎంజాయ్​ చేయలేకపోతున్నారట. ఆ విధంగా నైట్​ షిఫ్ట్​ చేసే వారు పగలు వయాగ్రా వేసుకొని శృంగారంలో పాల్గొనవచ్చా? అనేది కొందరినికి వస్తున్న ప్రశ్న. అయితే అందుకు వైద్య నిపుణలు ఇచ్చే సలహా, సూచనలు ఏమిటో తెలుసుకుందాం.

నైట్​ డ్యూటీ చేసేవాళ్లు.. పగలు వయాగ్రా వేసుకుని శృంగారంలో పొల్గొనవచ్చా?

అవసరం ఉంటే వేసుకోవాలి. రాత్రి, పగలు అని తేడా లేకుండా ఎప్పుడైనా వయాగ్రా తీసుకోవచ్చు. అయితే శృంగారానికి అరగంట లేదా గంట ముందు వయాగ్రా తీసుకుంటే మంచిది. అదే గంట ముందు అయితే ఇంకా ఉత్తమం. వయాగ్రా మాత్రల అవసరం ఉంటే అవి తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, గుండె జబ్బు ఉన్న వాళ్లు వీటికి దూరంగా ఉంటే మంచిది. అయితే ఈ మాత్రను తీసుకోవడం వల్ల కొందరి సైడ్​ ఎఫెక్ట్స్​ వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి, నడుంనొప్పి, కండరాల నొప్పి, కడుపులో వికారంతో పాటు శరీరమంతటా ఆందోళనకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ సైడ్​ఎఫెక్ట్స్​ లేకపోతే నిరభ్యంతరంగా వయాగ్రా తీసుకోవచ్చు. వయాగ్రాను తొలుత ఊపిరితిత్తుల సమస్యలతో పాటు లోబీపీ పేషెంట్ల కోసం వాడేవాళ్లు. ఈ మాత్ర తీసుకోవడం వల్ల రక్తనాళాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. అంతకంటే వయాగ్రా చేసే పనేమి లేదు. కానీ, డాక్టర్​ సలహా లేకుండా ఏ మందు వాడకూడదు.

సరైన నిద్ర లేకపోతే సెక్స్ డౌన్​ అవుతుంది అంటారా?

కచ్చితంగా డౌన్​ అవుతుంది. శరీరానికి సరైన నిద్ర లేనప్పుడు చెడు పదార్థాలు అన్నీ అలానే ఉంటాయి. కానీ, ఎప్పుడైన కంటినిండా నిద్ర పోతారో.. వారిలో చెడు పదార్థాలన్నీ తొలగిపోతాయి. రిలాక్స్​గా ఫీల్​ అవుతారు. సరైన నిద్ర ఉంటే శారీరికంగా, మానసికంగా ఆరోగ్యం ఉండడం సహా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఎప్పుడైతే సరైన నిద్ర లేనప్పుడు సెక్స్​ చేయాలన్న కోరిక కూడా తగ్గిపోతుంది. సెక్స్​లో బాగా పాల్గొనాలంటే కంటినిండా నిద్ర పోవాలి.

ఇదీ చూడండి..ఒత్తిడితో శృంగార జీవితంపై ప్రభావం.. నిజమెంత?

ABOUT THE AUTHOR

...view details