తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బరువు తగ్గాలా? వ్యాయామం అప్పుడే చేయండి! - fat to fit

బరువు తగ్గడానికి ఉదయం, సాయంత్రం అనే తేడా లేకుండా వ్యాయామాలు చేసేస్తుంటారు చాలామంది. కానీ, రోజులు గడుస్తున్నా.. పెద్దగా మార్పేం రాలేదని విసిగిపోతుంటారు. మరి.. ఏ సమయంలో కసరత్తులు చేస్తే బరువు తగ్గుతారు? తెలుసుకోవాలంటే చదివేయండి మరి.

Want to Lose Weight Faster
బరువు తగ్గడానికీ ఓ సమయం ఉంది!

By

Published : Jan 2, 2021, 1:18 PM IST

అధిక బరువును తగ్గించుకుని, స్లిమ్​గా మారాలని అందరూ అనుకుంటారు. అందుకే వ్యాయామాలు చేస్తుంటారు. కానీ, ఎంత వ్యాయామాలు చేసినా ఒక్కోసారి బరువులో ఏ మార్పు కనిపించదు. దానికి కారణం.. మనం వేళ కాని వేళల్లో కసరత్తుల చేయడమే! మనం ఏ సమయంలో వ్యాయామం చేస్తున్నామనేది.. కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వ్యాయమం చేసే వారితో పోలిస్తే.. అంతకుముందు వ్యాయామం చేస్తేనే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు వస్తాయని తేలింది. 'ఇంటర్నేషనల్​ జర్నీ ఆఫ్​ ఒబెసిటీ' అనే హెల్త్​ వెబ్​సైట్​ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

కసరత్తులు చేసే సమయం, బరవు తగ్గడానికి మధ్య సంబంధాన్ని కనుగొనే ఉద్దేశంతో 200 మందిపై ఈ అధ్యయనం చేశారు. వ్యాయామం చేసే సమయం ఆధారంగా వీరందరినీ గ్రూపులుగా విభజించి, 10 నెలల వ్యవధిలో ఈ పరిశోధన చేశారు. ఇందులో పాల్గొన్న సభ్యులంతా వారంలో ఐదు రోజులు వ్యాయామం చేసి, ప్రతీ సెషన్​లో 400 నుంచి 600 క్యాలరీలను కరిగించారు. వారు తీసుకునే ఆహారం, చేసే కసరత్తులను పరిశోధకులు విశ్లేషించి బరువు తగ్గడంలో వ్యాయామం చేసే సమయం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని తేల్చారు. అయితే ఈ వ్యత్యాసానికి గల కారణమేంటో మాత్రం చెప్పలేదు.

ఇదీ చూడండి:'వారాంత యోధులకూ' ప్రయోజనాలెక్కువే!

ABOUT THE AUTHOR

...view details