లాక్‌డౌన్ తర్వాత స్క్రీన్‌పై ఆధారపడుతున్న మహిళల శాతం గణనీయంగా పెరిగిందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పెరిగిన పనికితోడు దీని ప్రభావమూ తోడై తలనొప్పి, అసహనం వంటివి పెరుగుతున్నాయట. కాబట్టి.. కళ్ల పరిరక్షణపై దృష్టిపెట్టాలంటున్నారు నిపుణులు.
సాధారణంగా నిమిషానికి 12 నుంచి 18 సార్లు కళ్లు ఆర్పుతాం. స్క్రీన్‌ను చూసేటపుడు ఆ విషయాన్ని మర్చిపోతామట. దీనివల్ల కళ్లకు అందే సాధారణ తేమ తగ్గి, అవి పొడిబారుతాయి. దీంతో కళ్లు ఎర్రబారడం, తలనొప్పి. గ్యాడ్జెట్ల నుంచి వచ్చే వేడి కూడా కళ్లలోని తేమను ఆవిరి చేస్తాయి. కాబట్టి దీన్ని గమనించుకుంటూ ఉండాలి.