These Things To Do Sleeping After Sex : భార్యభర్తల మధ్య బంధం కలకాలం ఉండాలంటే వారి శృంగారం జీవితం ఆరోగ్యంగా ఉండాలి. ఇద్దరి లైంగిక ఆరోగ్యం బాగుండాలంటే శృంగారంలో పాల్గొన్న తరవాత కొన్ని పనులను కచ్చితంగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు తలేత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మూడ్‌ను సెట్ చేయడం నుంచి పర్ఫెక్ట్ ఫోర్ ప్లే వరకు సెక్స్‌కు ముందు ఏం చేయాలో అందరికీ తెలిసిందే. కానీ శృంగారంతరవాత ఏం చేయాలన్నది చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. దీంతో చాలా మంది అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే శృంగారం తరవాత ఎటువంటి పనులు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
Things To Do Sleeping After Sex : శృంగారం తరవాత మీ భాగస్వామిని హత్తుకోవడం, కలిసి నిద్రపోవడం లాంటివి చాలా మంది చేస్తుంటారు. ఇది ఒక మంచి అలవాటే. కానీ, వీటన్నింటి కంటే శృంగారం తరవాత ఖచ్చితంగా కొన్ని పనులు చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. శృంగారం తరవాత భార్యభర్తలిద్దరూ పరిశుభ్రంగా ఉండటం ముఖ్యమని అంటున్నారు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
వాష్ రూం వెళ్లడం :
శృంగారం తరవాత భార్యభర్తలిద్దరూ తప్పకుండా వాష్ రూం వెళ్లాలి. లేకపోతే చెడు ద్రవాలు బయటకు విడుదల కాకపోతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల భార్య భర్తలు శృంగారం తరవాత వాష్ రూం వెళ్లడం ద్వారా చెడు వీర్యకణాలు బయటకు వెళ్లి, అవాంఛిత గర్భధారణ సమస్యను తగ్గిస్తుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు చెడు బ్యాక్టీరియా మూత్రనాళానికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి, శృంగారనికి ముందు, తరవాత కచ్చితంగా వాష్ రూంకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ముత్రం రాకపోతే చల్లని నీళ్లు తాగి మూత్ర విసర్జన చేయడం మంచిదని అంటున్నారు.
ప్రైవేటు భాగాలు శుభ్రం చేసుకోవాలి :
భార్యభర్తల శృంగారం తరవాత ప్రైవేటు భాగాలను గోరు వెచ్చని నీటితో, తక్కువ గాఢత గల సబ్బులు, లేదా పీహెచ్ వాల్యూ తక్కువగా ఉన్న బాడీ వాష్ లిక్వీడ్స్‌తో క్లీన్ చేసుకోవాలి. తరవాత మెత్తటి, పొడి టవల్‌తో తేమ లేకుండా శుభ్రం చేసుకోవాలి. కానీ, ఎప్పుడు ప్రైవేటు భాగాలను ముందు నుంచి వెనుకకే శుభ్రం చేయాలి. యోని సొంతగా శుభ్రపరుచుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, మనం బయటి భాగాలను శుభ్రం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. ఓవర్ దీ కౌంట్ ఉత్పత్తిలో డౌచింగ్ చేయటం వల్ల యోని సంక్రమణ మరింత పెరుగుతుంది. దీంతో సున్నితమైన బ్యాక్టీరియా మరణించి యూరిన్ ఇన్ఫెక్షన్, యోనిటిస్, చికాకు పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు శృంగారం తరవాత ప్రైవేటు భాగాలను శుభ్రంగా ఉంచుకోవాలి.