These Plants Are to Keep Mosquitoes Away From House :కాలమేదైనా జనాల్ని తీవ్రంగా వేధించే సమస్యల్లో దోమల బెడద ఒకటి. నిద్రలేకుండా చేసే ఈ దోమలు.. ఏకంగా ప్రాణాలు కూడా తీసేయగలవు! వీటిని ఇంట్లోకి రాకుండా చేసేందుకు జనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆలౌట్, కాయిల్స్, క్రీమ్స్, మస్కిటో మ్యాట్ అంటూ రకరకాల వాటిని ఉపయోగిస్తుంటారు. కానీ.. ఏదీ సరిగా వర్కవుట్ కాదు. మీరు కూడా ఇలా చేసి విసిగిపోయారా..?
అయితే.. మేము చెప్పే ఈ మొక్కలను మీ ఇంట్లో పెంచండి. దోమల దండు నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. వాటి నుంచి వచ్చే వాసన కారణంగా.. దోమలు మనల్ని గుర్తుపట్టలేవు! ఫలితంగా దగ్గరకు రాలేవు. కాబట్టి ఈ మొక్కల్ని గార్డెన్లోనో, ఇంటి ముందరో పెంచుకుంటే.. దోమల బెడద మీ కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బంతిపూల మొక్కలు :ఈ మొక్కలు ఏడాది పొడవునా పూలు పూస్తాయి. ఈ మొక్క పువ్వులు దోమలను తరిమికొడతాయి. ఎక్కడైనా సులభంగా పెరిగే ఈ బంతి పూల మొక్కను ఆరుబయట లేదా బాల్కనీలో పెంచుకోవడం ద్వారా దోమల బెడద నుంచి ఉపశమనం పొందవచ్చు. దోమలను తరిమికొట్టడమే కాకుండా ఆ పూలను పూజకు కూడా ఉపయోగించవచ్చు.
తులసి మొక్క :ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. దోమలను కూడా తరిమికొడుతుంది. దీని నుంచి వచ్చే వాసన కారణంగా దోమలు రాకుండా ఉంటాయి. అలాగే తులసి ఆకులతో తయారుచేసిన స్ప్రే వాడినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. స్ప్రే ఎలా చేసుకోవాలంటే.. కొన్ని తులసి ఆకులను రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించండి. చల్లారిన తర్వాత ఆ వాటర్ని స్ప్రే బాటిల్‌లో పోసి, సాయంత్రం వేళ చేతులు, మెడ, కాళ్లపై స్ప్రే చేసుకోండి. అంతే మీ చుట్టూ ఉన్న దోమలను నియంత్రిస్తుంది.