Sudden Weight Gain Health Problems:ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తోంది. అయితే.. నార్మల్‌గా వెయిట్ పెరగడానికి కొన్ని రోజులు, నెలలు పడుతోంది. కానీ.. కొంతమంది మాత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా విపరీతమైన బరువు(Weight) పెరిగిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతారు. కారణాలు తెలుసుకోకుండానే వెయిట్ లాస్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు.
Weight Gain Health Problems :అయితే మీరు కూడా సడన్‌గా.. ప్రత్యేకించి ఎలాంటి ప్రయత్నం లేకుండా ఉన్నట్లుండి ఇలా బరువు పెరిగితే వెంటనే అలర్ట్ కావాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఊహించని విధంగా బరువు పెరిగితే.. అందుకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలే కారణం కావచ్చని వారు సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అశ్రద్ధ వహించినా మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ సడన్‌గా బరువు పెరగడానికి నిపుణులు చెబుతున్న కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కుషింగ్స్ సిండ్రోమ్ :కొందరు సన్నగా ఉన్నవారు కండబలం కోసం వ్యాయామాలు చేస్తూ పోషకాహార నిపుణుల సూచనల మేరకు ఆహార నియమాలు పాటిస్తుంటారు. అలా కాకుండా మీరు అమాంతం బరువు పెరిగితే.. అనుమానించాల్సిందే. ఈ విధంగా బరువు పెరగడానికి కుషింగ్స్ సిండ్రోమ్ కూడా ఒక కారణం. అసలు కుషింగ్ సిండ్రోమ్ అంటే ఏమిటంటే.. ఇది ఒక రకమైన హార్మోన్. మన బాడీ ఎక్కువ మొత్తంలో కార్టిసాల్‌ను రిలీజ్ చేసినప్పుడు ఈ సిండ్రోమ్ ఏర్పడుతుంది. ఈ హార్మోన్ జీవక్రియను నియంత్రిస్తుంది. కాబట్టి ఇది ఏర్పడినప్పుడు ఆకస్మాత్తుగా బరువు పెరుగుతారు. ముఖ్యంగా ముఖం, పొత్తికడుపు వంటి భాగాలలో ఈ సిండ్రోమ్ కారణంగా ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది.
హైపో థైరాయిడిజం : మీరు తీసుకునే ఆహారంలో ఎలాంటి మార్పులు లేకుండా, సాధారణ వ్యాయామాలు చేస్తున్నా.. ఉన్నట్లుండి బరువు పెరిగితే.. దానికి హైపో థైరాయిడిజం కూడా ఓ కారణం అయి ఉండొచ్చు. హైపో థైరాయిడిజం అంటే ఏమిటంటే.. మన బాడీలో T3, T4, TSH అనే హార్మోన్ల ఉత్పత్తిలో ఏదైనా తేడాలు వచ్చి ఇవి తక్కువగా రిలీజైతే థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది. ఈ కారణంగా అవయవాలు పనితీరు స్లో అవుతుంది. ఫలితంగా క్యాలరీలు త్వరగా కరగక శరీరంలో కొవ్వు పేరుకుపోయి వేగంగా బరువు పెరుగుతారు. అలాగే హైపోథైరాయిడిజం వస్తే గుండె కొట్టుకునే వేగం కూడా తక్కువగా ఉంటుంది.