These Foods Can Damage Gut Health :పేగులు అనారోగ్యానికి గురికావడం వల్ల క్రోనస్ వ్యాధి, ఎండోక్రైన్ వ్యవస్థలో సమస్యలు వస్తాయి. ఇంకా.. పెద్దల పేగులలో వాపు, క్యాన్సర్ వంటి ముప్పు పెరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే అని చెప్పుకోవచ్చు. అయితే.. ముఖ్యంగా కొన్ని ఆహారాలు, పానియాలు తీసుకోవడం కారణంగా పేగుల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Gut Health Damage Foods :మన శరీరంలో పేగులు సరిగ్గా పనిచేయకపోతే మొట్టమొదటగా ప్రభావితమయ్యేది జీర్ణ వ్యవస్థ. అయితే పేగుల ఆరోగ్యం మనం తినే ఆహార పదార్థాల మీద ఆధారపడి ఉంటుందనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని ఫుడ్స్(Foods) పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపి.. అవి సక్రమంగా పనిచేయకుండా చేస్తాయి. దాంతో ఒక్కసారిగా జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. మరి పేగుల ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
- మీ పేగుల ఆరోగ్యం మంచిగా ఉండాలంటే.. మీరు ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిల్లో కేలరీలు, అనారోగ్య కొవ్వులు, చక్కెర పదార్థాలు అధికంగా ఉంటాయి. మీరు వాటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా.. పేగులకు హాని కలిగే ప్రమాదం ఉంది.
- అలాగే గట్ సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే మీరు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ ఫుడ్ కూడా అధికంగా కేలరీలు, కొవ్వులు, చక్కెరలు, ఉప్పను కలిగి ఉంటుంది.
- మీరు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకంటున్నట్లయితే మలబద్ధకం, విరేచనాలు, ఇతర పేగు సమస్యలకు దారితీయవచ్చు.
- ఇకపోతే అధికంగా కొవ్వు, కెరోటిన్ కలిగి ఉండే ఆహారాలు కూడా పేగు ఆరోగ్యానికి హానికరం. వీటికి కూడా దూరంగా ఉండడం ఉత్తమం.
- ఇవి తీసుకుంటే పేగులలో ఫిటిబీన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే పేగు తిమ్మిరి, ఇతర సమస్యలకు కూడా దారితీయవచ్చు.
- ముఖ్యంగా మీరు పేగుల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.
- మీరు మద్యం ఎక్కువగా తీసుకోవడం ద్వారా గట్ మైక్రోబ్కు అంతరాయం కలుగుతుంది. అలాగే మీ గట్ లైనింగ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.