తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మీకు హార్ట్ ఎటాక్ రావొద్దంటే - ఈ 7 ఆహార పదార్థాలను అస్సలు తినొద్దు!

Dangerous Foods for Heart Health : మనం ఆరోగ్యంగా జీవించడంలో గుండె ప్రధాన పాత్ర పోషిస్తుంది. మరి.. అంతటి ముఖ్యమైన పార్ట్ హెల్తీగా ఉండాలంటే.. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం తప్పనిసరి. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ తినకూడని ఆ పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం..

Heart
Heart

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 9:59 AM IST

Updated : Jan 8, 2024, 10:08 AM IST

These Foods Dangerous for Heart :ఇటీవలవయసుతో సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్​తో చనిపోతున్న వారి సంఖ్య పెరిగింది. ఇందులో ఇతర కారణాల శాతం ఎంత ఉన్నా.. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లదే మేజర్ వాటా అంటున్నారు నిపుణులు. కాబట్టి.. గుండె(Heart)ను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మీ డైట్​లో కొన్ని ముఖ్యమైన మార్పులు కంపల్సరీ అంటున్నారు. కేవలం 7 ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అప్పుడే మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఉప్పు, పంచదార :గుండె సంబంధిత సమస్యలను పెంచడంలో ఉప్పు, చక్కెర ముందు వరుసలో ఉన్నాయి. ఇవే ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్​కు కారణమంటున్నారు నిపుణులు. అంతే కాదు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు.

రెడ్ మీట్ :ఇది తినడం వల్ల గుండె జబ్బులతో పాటు మధుమేహ సమస్యలూ వస్తాయి. అందుకే గొడ్డు మాంసం, పంది మాంసం ఎక్కువగా తినకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటిలో ఎక్కువగా ఉండే శాచ్యురేటెడ్ ఫ్యాట్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందట.

సోడా : మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. సోడా వినియోగానికీ వీలైనంత దూరంగా ఉండాలి. ఎందుకంటే సోడా తాగేవారిలో గుండె జబ్బులు, ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, హై బీపీ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే సోడా వాటర్ ఆధారిత కూల్​డ్రింక్స్​కు దూరంగా ఉండటం మీ గుండె ఆరోగ్యానికి మంచిది.

గుండెపోటు లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఇలా చేయండి!

వేయించిన చికెన్ :చాలా మంది వేపుళ్లు బహుఇష్టంగా తింటుంటారు. అందులో చికెన్ అయితే చెప్పాల్సిన పనిలేదు. కానీ అది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే డీప్-ఫ్రైడ్ చికెన్ కేలరీలు, కొవ్వు, సోడియం కంటెంట్‌ను పెంచుతుంది. కారణంగా గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చికెన్‌ని డీప్‌ ఫ్రై చేయడానికి బదులు రోస్ట్‌ చేసుకుని తినడం మంచిది.

వెన్న :దీనిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెన్నకు దూరంగా ఉండటం మంచిది.

ఫ్రెంచ్ ఫ్రైస్ :ఈ రోజుల్లో యువత ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే యమ ఇష్టంతో తింటారు. కానీ అవి గుండెకు చాలా హానికరం. ఎందుకంటే వీటిలో కొవ్వు, ఉప్పు ఎక్కువ. కారణంగా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటం బెటర్ అంటున్నారు నిపుణులు. అలాగే వారానికి 2 నుంచి 3 సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా హాష్ బ్రౌన్స్ తినే వ్యక్తులు త్వరగా చనిపోయే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది.

ఫ్లేవర్డ్ ఫుల్-ఫ్యాట్ పెరుగు : ఇక చివరగా మీ గుండె ఆరోగ్యానికి కాపాడుకోవాలంటే ఫ్లేవర్డ్ ఫుల్-ఫ్యాట్ పెరుగుని తినకుండా ఉండాలి. ఎందుకంటే దీన్ని రోజూ తినే వారికి అధిక రక్తపోటు, బరువు పెరగడం, ఉబ్బరం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ అని మీరు తెలుసుకోవాలి. దీనికి బదులు సాధారణ, తక్కువ కొవ్వు ఉండే పెరుగును తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.

Best Fiber Foods In Telugu : ఫైబర్​ ఫుడ్​తో గుండె జబ్బులు, క్యాన్సర్​ దూరం!

మీరు ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - మీ పేగుల్లో విషం నింపుతునట్టే!

Last Updated : Jan 8, 2024, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details