Before Sleeping Habits Main Reason For Obesity :మనం మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ తగినంత నిద్ర చాలా అవసరం. కానీ.. ప్రస్తుత బిజీ లైఫ్‌లో అంతా గజిబిజీ. ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు నిద్రపోతున్నారో క్లారిటీ ఉండట్లేదు. దీనికితోడు.. నిద్రపోయే ముందు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. వీటివల్ల బరువు మరింతగా పెరిగిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ : చాలా మందికి నిద్రపోయే ముందు స్మార్ట్‌ఫోన్ యూజ్ చేసే అలవాటు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఒక్క ఫోన్ మాత్రమే కాదు ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా సరే నిద్రకు ముందు వాడడం మంచిది కాదు. ఎందుకంటే వీటి నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ మీ నిద్రకు భంగం కలిగించడమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. దాంతో సరైన నిద్ర లేకపోతే బరువు అదుపులో ఉండదు.
అర్ధరాత్రి ఫుడ్స్ తీసుకోవడం : కొందరికి అర్ధరాత్రి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అది కూడా బరువు పెరగడానికి కారణమంటున్నారు నిపుణులు. ఎందుకంటే పడుకునే టైమ్‌లో మీరు తీసుకునే ఫుడ్ జీర్ణం కావడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. అలాగే నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా మిడ్నైట్ తీసుకునే స్నాక్స్‌లో చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఉండేవి అసలు తీసుకోకూడదు.
అధిక కార్బ్ ఆహారాలు :చాలా మంది డిన్నర్లో తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించరు. ముఖ్యంగా అధిక కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్స్ తీసుకుంటారు. బరువు పెరగడానికి అది కూడా ఒక కారణమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కార్బ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ మన బ్లడ్‌లో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. కాబట్టి.. వీలైనంతమేర వాటిని తీసుకోవడం తగ్గించండి. బదులుగా లీన్ ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం బెటర్.
Weight Loss Tips in Telugu : బరువు తగ్గాలా..? కుస్తీలు అవసరం లేదు.. రోజూ ఇలా చేస్తే చాలు!