'బ్రిటన్లో ఓ కరోనా వేరియంట్.. దక్షిణాఫ్రికాలో మరో వేరియంట్.. భారత్లో ఇంకొక వేరియంట్...' ఇలా కరోనా మహమ్మారి రూపాంతంరం చేందుతూ వస్తోంది. అదే కాకుండా.. సాధారణ కరోనా లక్షణాలు(Covid-19 symptoms) కూడా మారుతున్నట్టు ఇటీవలే తేలింది. ముఖ్యంగా ప్రమాదకరంగా మారుతున్న డెల్టా వేరియంట్లక్షణాలు(Delta variant symptoms).. సాధారణ కరోనా లక్షణాల్లో ఎక్కువగా కనపడలేదని ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది.
మార్పులు ఎందుకు?
18నెలలుగా ప్రపంచం కరోనాతో విలవిలలాడుతోంది. అప్పటి నుంచి కరోనా రూపాంతరం చెందుతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే లక్షణాలు కూడా మారుతున్నాయి. కరోనా తొలి నాళ్లలో జ్వరం, జలుబు, తలనొప్పిని వైరస్ సాధారణ లక్షణాలుగా భావించారు. కానీ ఇప్పుడు వాటిల్లోనూ మార్పులు వచ్చాయి.
కారణాలేంటి?
సాధారణ లక్షణాల్లో మార్పులు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వైరస్ వ్యాప్తి వేగం, వ్యాప్తి చెందుతున్న తీరు మనుషుల అనారోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. వయస్సు, లింగం, వ్యాయామం, ఆరోగ్యం, ఒత్తిడి, తీసుకునే మందులు, చేసే భోజనం.. ఇలా మనుషుల్లో ఎన్నో తేడాలు ఉంటాయి. వృద్ధుల్లో, యుక్త వయస్సు వారిలో రోగనిరోధక శక్తి వేరువేరుగా ఉంటుంది. ఇవన్నీ లక్షణాలను ప్రభావితం చేసే అంశాలే.
మరి 'డెల్టా వేరియంట్' సాధారణ లక్షణాలేంటి?