మాత్రల ఆర్భాటం పెరిగిపోయింది. వాజీకరణాలూ, సామర్ధ్య సాధనాలంటూ (sex tablets for women) మార్కెట్లో రకరకాల మాత్రల గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. ఒక రకంగా పురుషుల్లో అత్యధికంగా కనిపించే అంగ స్తంభన సమస్యకు సిల్దినాఫెల్ సిట్రేట్ (వయాగ్రా మొదలగు) వంటి మాత్రలు అందుబాటులోకి రావటం వల్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల చాలామంది ఈ మాత్రలనే (sex pills for men) ఆశ్రయిస్తున్నారని, ఇది సరికాదని నిపుణులు (sex pills side effects) హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకుంటే శృంగార జీవితం దానంతట అదే ఉరకలెత్తుతుందని భావించకూడదని అంటున్నారు.
శృంగార యాత్రకు మాత్ర ఒక్కటే సరిపోదు - sex pills for men
శృంగార జీవితంలో రకరకాల మాత్రలు (sex tablets for men) అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల చాలామంది ఈ మాత్రలనే ఆశ్రయిస్తున్నారు. ఇది సరికాదని నిపుణులు (sex pills side effects) హెచ్చరిస్తున్నారు. మాత్రలు వేసుకుంటే శృంగార జీవితం, ఉరకలెత్తుతుందని భావించకూడదంటున్నారు.
శృంగార మాత్రలు
పురుషుల్లో అంగ స్తంభన సమస్యలు చాలా ఎక్కువ! నడివయసుకు వచ్చేసరికి దీంతో చాలామంది మానసికంగా మథనపడుతుంటారు. దీన్ని చక్కదిద్దటానికి ఇప్పుడు సమర్థమైన మందులు అందుబాటులో ఉన్న మాట వాస్తవం. శృంగార జీవితంలో భాగస్వాములిద్దరికీ తృప్తి దక్కాలంటే స్తంభనలు బాగుండటం, అంగాంగ సంభోగం ఒక్కటే ముఖ్యం కాదని గ్రహించాలి.
- ఇద్దరి మధ్యా అన్యోన్యమైన అవగాహన, ప్రతి దశలోనూ దాంపత్య సుఖాలను కలిసి ఆస్వాదించే స్వభావం పెంచుకోవాలి. పటుత్వం కోసం మాత్రలను ఆశ్రయించటానికి ముందే వాటి గురించి భాగస్వామితో చర్చించాలి.
- శృంగారంలో ఇష్టాయిష్టాల గురించి అరమరికలు లేకుండా మాట్లాడుకోవటం అవసరం. కొందరు ప్రేమగా మాట్లాడటం, సాన్నిహిత్యాన్నీ వివిధ రూపాల్లో చూపించటం, సున్నిత స్పర్శల వంటివాటిని ఎక్కువగా ఆస్వాదిస్తారు. నేరుగా లైంగిక చర్యలకు ఉపక్రమించకూడదు.
- మాత్రలు, మందులు తీసుకున్నా కొన్నిసార్లు స్తంభన సమస్యలు తలెత్తుతూనే ఉండొచ్చు. గాఢమైన వాంఛ, శారీరక ప్రేరణల వంటివి లేకపోతే మందులు తీసుకున్నా తృప్తి దక్కకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో భాగస్వాములిద్దరూ- ఒకరి నుంచి మరొకరు ఏం ఆశించొచ్చన్నది వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకోవాలి. వయసును బట్టి శృంగార జీవితంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయన్న అవగాహన పెంచుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి.
- సంభోగ సమయంలో సంతృప్తి దక్కనప్పుడు నగుబాటులో కూరుకుపోవటం, కుంగిపోవటం కాకుండా ఆ ఇబ్బందికర సందర్భాన్ని నెగ్గుకొచ్చేందుకు సన్నద్ధం కావాలి.
ఇదీ చదవండి:మెంతులు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు