తెలంగాణ

telangana

By

Published : May 15, 2021, 4:57 PM IST

ETV Bharat / sukhibhava

కొత్తగా పిల్లలకూ కరోనా సోకిందా ? భయం వద్దు..!

పరివర్తనం చెందిన కొత్త కరోనా వైరస్ పిల్లలకూ సోకుతోంది. వ్యాధి లక్షణాలు వారిలో.. ప్రమాదకర స్థాయిలో లేకపోయినా.. తల్లిదండ్రలకు ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పటల్ లో పనిచేస్తున్న వైద్యలు డా. విజయానంద్ జమల్పురి పెద్దలు, పిల్లలు కొవిడ్ బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈటీవీ సుఖీభవ కు వివరించారు.

The new strain of Covid-19 affecting kids Do not panic
కొత్తగా పిల్లలకూ కరోనా..! భయంవద్దు..

కొవిడ్ రెండో దశలో దేశమంతా విజృంభిస్తోంది. గత సంవత్సరం కంటే ఈ ఏడు పెద్దలకే కాకుండా పిల్లలకూ కొవిడ్ సోకటం ఆందోళన కలిగించే అంశం. గత ఏడాది పిల్లలకు వైరస్ అంతగా సోకలేదు. సోకినా లక్షణాలు పెద్దగా కనిపించేవి కావు. గత కొన్ని రోజులుగా పిల్లల్లోనూ లక్షణాలు కనిపించటం, ఎక్కువ మంది పిల్లలు పాజిటివ్ గా తేలటం ప్రమాదంగా సూచిస్తోంది. 8 సం.ల వయసులోపు పిల్లలకు, అపుడే పుట్టిన పసిపాపలకు తల్లుల నుంచి కోవిడ్ సంక్రమించటం చాలా సహజంగా జరుగుతోంది. తల్లి పాల నుంచి ఈ వైరస్ సోకదు. పుట్టని పిల్లలకు గర్భంలో మావి ద్వారా సోకినట్టుగా రూఢి అయింది.

పిల్లల్లో కొవిడ్ లక్షణాలు:

పెద్దల్లో లాగానే పిల్లల్లోనూ జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబు కనిపిస్తాయి. కొందరికి వాంతులు, విరేచనాలు కూడా కలుగుతాయి. పిల్లలు ఎవరైనా వాంతులు, విరేచనాలతో బాధ పడుతుంటే కోవిడ్ టెస్ట్ చేయించాలి. సాధారణంగా వర్షాకాలంలోనే పిల్లల్లో విరేచనాలు కలుగుతుంటాయి. వేసవిలోనూ విరేచనాలైతే కొవిడ్ నే అనుమానించాలి. 10 సం.లు దాటిన పిల్లల్లో తలనొప్పి, ఒళ్లునొప్పులు, బలహీనత, ఆహారంలో రుచి, వాసన లేకపోవటం కలుగవచ్చు. అయినా పిల్లల్లో తీవ్ర కోవిడ్ లక్షణాలు కలిగే అవకాశం చాలా తక్కువ. వారికి వైద్య సహాయం అందించటం కోసం కింది వివరాలు గుర్తుంచుకోవాలి.

  • జ్వరం, దగ్గు, విరేచనాలు లాంటి స్వల్ప లక్షణాలు ఉన్న పిల్లలు సులభంగా కోలుకుంటారు. శ్వాస తీసుకోవటంలో వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
  • వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ, ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ కొందరికి న్యుమోనియా కూడా కలగవచ్చు. వీరిలో పిల్లి కూతలు, నిస్సత్తువ ఉండి ఎక్కువ సేపు నిద్రపోతూ ఉంటారు.

ఈ మూడు దశలే కాక వ్యాధి తీవ్రత మరింత పెరిగి కొందరికి వెంటిలేటర్ సహాయం అవసరం పడవచ్చు. కొందరికి డయాలసిస్ కూడా అవసరం పడవచ్చు. అయితే ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ.

ఆస్పత్రుల్లో చేర్చాలా?

గత సంవత్సరంతో పోల్చితే ఈ సారి ఎక్కువ మంది పిల్లలు కొవిడ్ సోకి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరి సంఖ్య పెద్దల కంటే తక్కువగానే ఉంది. కరోనా నుంచి పిల్లలు వేగంగా, సులభంగా కోలుకుంటున్నారు. ఇంటెన్సివ్ కేర్ అవసరం అంతగా ఉండదు. అయినా పిల్లలను ఒక కంట కనిపెడుతూ కోవిడ్ లక్షణాలున్నాయేమోనని గమనిస్తూ ఉండాలి. వారికి చేతులు శుభ్రపరచుకోవటం, మాస్క్ వాడటం లాంటి అలవాట్లను నేర్పించాలి.

ABOUT THE AUTHOR

...view details